Fri. Mar 27th, 2026

సుహాస్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘హే బలవంత్’ ప్రమోషనల్ కంటెంట్‌తో అందరి దృష్టిని ఆకర్షించింది. మొదట ‘హే భగవాన్’ అనే టైటిల్‌తో ప్రచారమైన ఈ చిత్రం, కొన్ని కారణాల వల్ల పేరు మార్చుకోవాల్సి వచ్చింది. శివాని నాగరం హీరోయిన్‌గా నటించిన ఈ ‘A’ సర్టిఫైడ్ మూవీ ఫిబ్రవరి 20, 2026న థియేటర్లలో విడుదలైంది.

థియేటర్ల వద్ద మిశ్రమ స్పందనను మూటగట్టుకున్న ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్‌కు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5 ఈ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. మార్చి 31, 2026 నుండి ‘హే బలవంత్’ స్ట్రీమింగ్ ప్రారంభం కానుందని అధికారికంగా ప్రకటించారు.

గోపి అచ్చర దర్శకత్వం వహించిన ఈ చిత్రం కేవలం తెలుగులోనే కాకుండా తమిళం, కన్నడ మరియు మలయాళ భాషల్లో కూడా అందుబాటులోకి రానుంది. వి.కె. నరేష్, సుదర్శన్, వెన్నెల కిషోర్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకు వివేక్ సాగర్ సంగీతాన్ని అందించాడు.

The publish ఓటీటీ డేట్ లాక్ చేసుకున్న సుహాస్ ‘హే బలవంత్’ first seemed on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Rankings.