గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘గేమ్ ఛేంజర్’పై ఎలాంటి అంచనాలు క్రియేట్ అయ్యాయో అందరికీ తెలిసిందే. స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా భారీ స్థాయిలో జనవరి 10న గ్రాండ్ రిలీజ్ చేయనున్నారు. ఇక ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తు్న్నారు. అయితే, ఈ సినిమాను కోలీవుడ్‌లోనూ భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.
తమిళ్‌లో స్టార్ హీరో అజిత్ నటించిన ‘విదాముయార్చి’ కూడా సంక్రాంతికి రిలీజ్ అవుతుండటంతో పోటీ భారీగా నెలకొంది. అయితే, ఇప్పుడు అజిత్ సినిమా సంక్రాంతి రేసు నుంచి తప్పుకోవడంతో ‘గేమ్ ఛేంజర్’కు పోటీ లేదని అభిమానులు సంతోషించారు. కానీ, ఇప్పుడు తమిళంలో ఏకంగా అరడజను సినిమాలు ‘గేమ్ ఛేంజర్’కు పోటీగా రానున్నాయి. అజిత్ సినిమా వాయిదా పడటంతో ఒక్కసారిగా చిన్న సినిమాలు పొంగల్ రేస్‌లో రిలీజ్‌కు వస్తున్నాయి.
వనంగన్, కాదలిక్కు నేరమిల్లై, టెన్ అవర్స్, పదవి తలైవన్, మద్రాస్ కారన్, తరుణం, సుమో వంటి సినిమాలు పొంగల్ రేస్‌లో రిలీజ్‌కు రాబోతున్నట్లు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ‘గేమ్ ఛేంజర్’కు తమిళ్‌లో మళ్లీ కష్టాలు మొదలయ్యాయని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా తమిళ్‌లో కూడా భారీ విజయాన్ని అందుకోవాలని వారు కోరుతున్నారు.
The post ‘గేమ్ ఛేంజర్’కు పోటీగా అరడజను సినిమాలు first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.