ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన అవైటెడ్ పాన్ ఇండియా సీక్వెల్ చిత్రం “పుష్ప 2” కోసం అందరికీ తెలిసిందే. మరి ఎన్నో అంచనాలు నడుమ పాన్ ఇండియా భాషల్లో భారీ క్రేజ్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రం కోసం అభిమానులు సహా నార్త్ మార్కెట్ లో కూడా సాలిడ్ హైప్ నెలకొంది.
ఇలా తెలుగు సహా హిందీలో కూడా పుష్ప 2 మేనియా బుకింగ్స్ అంతా ఓ రేంజ్ లో కనిపిస్తుండగా ఇపుడు హిందీలో మాత్రం పుష్ప 2 కి భారీ డిమాండ్ నెలకొన్నట్టుగా కనిపిస్తుంది. అక్కడ దెబ్బకి అయితే ఏకంగా అదనపు షోలు మిడ్ నైట్ షోలు కూడా థియేటర్స్ వారు జనం డిమాండ్ మేరకు వేస్తున్నారట. ఇది అక్కడ కేవలం బిగ్ స్టార్స్ సినిమాలకే జరుగుతూ ఉంటుంది. ఇలాంటిది పుష్ప 2 కి ఈ రేంజ్ డిమాండ్ కనిపించడం అనేది ఊహించని అంశం అని చెప్పాలి.
The post నార్త్ లో “పుష్ప 2” కి భారీ డిమాండ్.. first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.