తమిళ విలక్షణ నటుడు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి హీరోగా నటించిన రీసెంట్ చిత్రం “మహారాజ” ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా తర్వాత తాను నటించిన మరో చిత్రం ఈ ఏడాదిలో రిలీజ్ కి రాబోతుంది. మరి ఆ చిత్రమే “విడుదల పార్ట్ 2”. ప్రముఖ దర్శకుడు వెట్రిమారన్ తెరకెక్కించిన ఈ హై వోల్టేజ్ ఎమోషనల్ అండ్ యాక్షన్ డ్రామా చాలా కాలం నుంచి తెరకెక్కిస్తూ ఇపుడు ఎట్టకేలకి రిలీజ్ కి రాబోతుంది.
అయితే తమిళ్ లో సహా తెలుగులో ఈ డిసెంబర్ 20న వస్తున్న ఈ సినిమా నిడివి ఇపుడు బయటకి వచ్చింది. మరి ఈ సినిమా ఏకంగా 2 గంటల 52 నిమిషాల పెద్ద నిడివితోనే వస్తుంది అని చెప్పాలి. మొదటి పార్ట్ తో పోలిస్తే పార్ట్ 2 కి మన తెలుగు ఆడియెన్స్ లో మరీ అంత ఎక్కువ బజ్ కనిపించడం లేదు.
డెఫినెట్ గా సినిమాలో కంటెంట్ క్లిక్ అయితే తప్ప ఇంత పెద్ద సినిమా అందులోని డబ్బింగ్ మన తెలుగు ఆడియెన్స్ కి ఎక్కుతుందా లేదా అనేది ప్రశ్నే అని చెప్పాలి. ఈ మధ్య వచ్చిన తమిళ ప్రముఖ చిత్రాలు “ఇండియన్ 2”, “కంగువా” లు మొదట ఒక రన్ టైం తో వచ్చి తర్వాత ట్రిమ్ చేసుకున్నారు. మరి విడుదల 2 కి కూడా ఇలానే అవుతుందా లేక ఆడియెన్స్ ని ఎంగేజ్ చేస్తుందా అనేది మాత్రం వేచి చూడాలి.
The post “విడుదల 2″కి భారీ రన్ టైం.. తెలుగులో వర్క్ అవుతుందా!? first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.