I Acted Without a Blouse in Nirnayam Veteran Actress Archana
I Acted Without a Blouse in Nirnayam Veteran Actress Archana

తెలుగు సినిమా చరిత్రలో కొన్ని సినిమాలు ఎప్పటికీ మిగిలిపోతాయి. అలాంటి చిత్రాలలో ఒకటి నిరీక్షణ. 1982లో విడుదలైన ఈ క్లాసిక్ సినిమాతో ప్రేక్షకుల మనసులు గెలిచిన నటి అర్చన తాజాగా చేసిన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

బాలుమహేంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన నిరీక్షణ సినిమాలో అర్చన ఒక గిరిజన యువతిగా నటించింది. ఈ పాత్ర కోసం ఆమె చేసిన సాహసం ఇప్పుడు ఆమెే గుర్తు చేసుకుంటూ చెప్పింది. ఇటీవల ‘షష్టిపూర్తి’ సినిమా ప్రమోషన్‌లో భాగంగా మాట్లాడుతూ, “ఆ సినిమాలో నేను చీరకట్టులో బ్లౌజ్ లేకుండా నటించాను. ఇది ఒక సాహసమే. కానీ బాలుమహేంద్ర్ గారి మీద నాకు నమ్మకం ఉంది. ఆయన సినిమాల్లో ఎక్కడా అశ్లీలత ఉండదు” అని అన్నారు.

ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొత్త తరం ప్రేక్షకులకు నిరీక్షణ సినిమా పుణ్యమేనని అర్థమవుతోంది. “ఆకాశం ఏ నాటిదో.. అనురాగం ఆ నాటిదే” వంటి సాంగ్స్ ఇప్పటికీ సంగీత ప్రియులకు ఎంతో ఇష్టమైనవి.

అర్చన నటించిన ఈ సినిమా తర్వాత ఆమె చాలా కాలం తెరపై కనిపించలేదు. అయితే ఇప్పుడు ఆమె రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘షష్టిపూర్తి’ సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. అర్చన మళ్లీ వెండితెరపై కనిపించబోతుండటంతో ఆమె అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *