శోభితాతో కొత్త జీవితం పై చైతు క్రేజీ కామెంట్స్ | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings

Published on Nov 24, 2024 11:00 PM IST

హీరో నాగచైతన్య హీరోయిన్ శోభితా ధూళిపాళ్ల పెళ్లి పీటలెక్కనున్న విషయం తెలిసిందే. రీసెంట్ గానే వీరి నిశ్చితార్థం వేడుక కూడా జరిగింది. ప్రస్తుతం పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ క్రమంలో తనకు కాబోయే సతీమణి, నటి శోభితా ధూళిపాళ్ల పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు నాగచైతన్య. తన జీవితంలో ఏర్పడిన వెలితిని ఆమె పూర్తి చేస్తుంది అంటూ నాగచైతన్య చెప్పుకొచ్చారు.

నాగచైతన్య, శోభితాతో తన పెళ్లి గురించి మాట్లాడుతూ.. ‘మా పెళ్లి చాలా సింపుల్‌, సంప్రదాయబద్ధంగా జరగబోతుంది. ఈ వేడుకల్లో ఆర్భాటాలకు తావులేదు. ప్రస్తుతం ఉత్సాహంగా పనులు జరుగుతున్నాయి. గెస్ట్‌ లిస్ట్‌, పెళ్లికి సంబంధించిన ఇతర విషయాలను ఇద్దరం కలిసి నిర్ణయిస్తున్నాం. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌ మా కుటుంబానికి ఎంతో ప్రత్యేకం. స్టూడియోలోని తాతగారి విగ్రహం ఎదురుగా మా పెళ్లి జరగబోతుంది. ఆయన ఆశీస్సులు మాపై ఎప్పుడూ ఉంటాయి. ఇక శోభితాతో కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు ఆశగా ఎదురుచూస్తున్నా’ అని చైతు తెలిపారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *