యంగ్ టైగర కు జై లవకుశ, మెగాస్టార్ కు వాల్తేర్ వీరయ్య వంటి సూపర్ హిట్స్ అందించిన దర్శకుడు బాబీ. తదుపరి సినిమాను ‘గాడ్ ఆఫ్ మాసెస్’ నందమూరి బాలకృష్ణ హీరోగా డాకు మహారాజ్ అనే సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమాలో బాలయ్యకు విలన్ గా బాలీవుడ్ ఒకప్పటి స్టార్ హీరో, ఇప్పటి స్టార్ విలన్ బాబీ డియోల్ ను తీసుకువచ్చాడు బాబీ. అయితే బాబీ డియోల్ గురించి విస్తుపోయే వాస్తవాలు తెలిపాడు డైరెక్టర్ బాబీ.
ఓ ఇంటర్వ్యూలో భాగంగా బాబీ డియోల్ గురించి ఎవరికి తెలియని విషయాలను తెలియాజేసాడు బాబీ. అయన మాట్లాడుతూ ‘ యానిమల్ కు ముందు డాకు కథ బాబీ డియోల్ కు చెప్పాను. ఆ సినిమా రిలీజ్ తర్వాత స్టార్ అయిపోయాడు. కానీ దానివెనుక చాలా ఎమోషనల్ జర్నీ ఉంది. ఒకసారి ఆయన కొడుకు వాళ్ళ అమ్మతో నాన్న ఇంక పని చేయడా అని అడిగినపుడు ఆ మాటలు విన్న డియోల్ సూసైడ్ చేసుకుందాం అనుకున్నారట. సినిమాలు లేక దాదాపు 15 ఏళ్లుగా సినిమాలు లేకుండా ఇంట్లో కూర్చుని భార్య డబ్బులతో బ్రతికాడు ఆ సమయంలో వచ్చిన ఒక తెలుగోడు సందీప్ రెడ్డి వంగా నా లైఫ్ నే మార్చేసాడు అని చాలా ఎమోషనల్ గా చెప్పాడట బాబీ డియోల్. కానీ ఇప్పుడు బాబీకి ఆడినంత రెమ్యునరేషన్ ఇవ్వడానికి నిర్మాతలు రెడీగా ఉన్నారు. అలాగే ఈ సినిమాలో బాలయ్య కు సమానంగా బాబీ డియోల్ రోల్ ఉంటుంది’ అని అన్నాడు.