Published on Dec 4, 2024 7:57 AM IST
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్నా హీరోయిన్ గా దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా చిత్రం “పుష్ప 2 ది రూల్” కోసం అందరికీ తెలిసిందే. మరి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పాన్ ఇండియా ఆడియెన్స్ ఈ సినిమా కోసమే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆల్రెడీ జస్ట్ ప్రీ సేల్స్ తోనే 100 కోట్ల వసూళ్లు కొల్లగొట్టేసిన పుష్ప 2 బన్నీ ఖాతాలో బిగ్గెస్ట్ రికార్డు సెట్ చేసింది.
ఇక ఇది కాకుండా మేకర్స్ పుష్ప 2 సహా అల్లు అర్జున్ పేరుతో రేర్ ఫీట్ ని సెట్ చేశారు. ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఎక్స్(ట్విట్టర్) లో పలు చిత్రాలకి ఎమోజి రూపాన్ని అందిస్తుంటారని తెలిసిందే. ఇది చాలా తక్కువ సినిమాలకి మాత్రమే చేయడం జరుగుతుంది. మన తెలుగులో అయితే రీసెంట్ గా సలార్ కి చేశారు. కానీ ఇపుడు పుష్ప 2 ఈ రేర్ ఫీట్ ని అందుకొని సాలిడ్ ప్రమోషన్స్ నడుమ ఇపుడు థియేటర్స్ లోకి వస్తుంది. మరి ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న ఈ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ఎలా ఉండబోతుందో చూడాల్సిందే.