
సౌత్ స్టార్ త్రిష కృష్ణన్ మరోసారి ఓటీటీ వేదికగా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. తాజా సస్పెన్స్ థ్రిల్లర్ ‘ఐడెంటిటీ’ ఇప్పుడు జీ5 లో స్ట్రీమింగ్ అవుతోంది. టోవినో థామస్, వినయ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం, ఇంటెన్స్ మిస్టరీ & థ్రిల్లింగ్ ట్విస్ట్‌లతో అందరినీ ఆకట్టుకుంటోంది.
కథ విషయానికి వస్తే – త్రిష అలీషా పాత్రలో కనిపిస్తుంది. ఓ హత్య కేసులో ఏకైక ప్రత్యక్ష సాక్షి. పోలీస్ ఇన్స్పెక్టర్ అలాన్ (వినయ్) ఆమె మాటలు నమ్మి, నిందితుడి ముఖాన్ని గీయించేందుకు హరన్ శంకర్ (టోవినో థామస్) సహాయం తీసుకుంటాడు. ఆ దర్యాప్తులో పలు షాకింగ్ ట్విస్ట్‌లు చోటుచేసుకుంటాయి.
ఈ సినిమాను ప్రత్యేకత చేసేది కథలోని మలుపులు, టెన్షన్ బిల్డప్, మరియు క్లైమాక్స్ వరకు ఉన్న సస్పెన్స్. ముఖ్యంగా త్రిష, టోవినో థామస్ నటన హైలైట్. అలాగే, జేక్స్ బిజోయ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ థ్రిల్లర్ ఎఫెక్ట్ ను పెంచింది. అఖిల్ జార్జ్ సినిమాటోగ్రఫీ టెన్షన్-ఫీల్డ్ విజువల్స్ అందించింది.
సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ ప్రేమించే వారికి ‘ఐడెంటిటీ’ తప్పక చూడాల్సిన మూవీ. ఇప్పుడే జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. థ్రిల్లింగ్ అనుభూతి కోసం తప్పక చూడండి.