Mon. Oct 13th, 2025
IdliKadai Review : ధనుష్ ‘ఇడ్లీ కొట్లు’ ఓవర్శీస్ రివ్యూ..

ధనుష్ అటు హీరోగా, నిర్మాతగా, డైరెక్టర్ గా సూపర్ సక్సెస్ ఫుల్ గా కెరీర్ ను సాగిస్తుస్తున్నాడు. గతేడాది ధనుష్ దర్శకత్వంలో వచ్చిన ‘రాయాన్’ సూపర్ హిట్ గా నిలవడమే కాకుండా ధనుష్ కు కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ అందించింది. ఈ ఏడాది ఆరంభంలో వచ్చిన ‘NEEK’ కూడా హిట్ గా నిలిచింది. ఇక లేటెస్ట్ గా ధనుష్ డైరెక్షన్ లో వచ్చిన చిత్రం ‘ఇడ్లీ – కడాయ్’. తెలుగులో ఇడ్లీ కొట్టు పేరుతో నేడు గ్రాండ్ గా రిలీజ్ అయింది.

Additionally Learn : Madharaasi : ‘మదరాసి’ ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేసిందిగా.. ఎక్కడంటే?

తిరు వంటి సూపర్ హిట్ సినిమాలో ధనుష్ కు జోడిగా నటించిన నిత్యామీనన్ ‘ఇడ్లీ – కడాయ్’ లో హీరోయిన్‌గా నటిస్తుండగా అత్యంత భారీ బడ్జెట్ పై డాన్ పిక్చర్స్ , వండర్ బార్ ఫిల్మ్స్ బ్యానర్స్‌పై ఆకాశ్ భాస్కరన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అర్జున్ రెడ్డి భామ షాలిని పాండే ముఖ్య పాత్రలో నటించింది. ఓవర్సీస్ లో ప్రీమియర్స్ తో రిలీజ్ అయిన ఈ సినిమా ఓవర్సీస్ టాక్ ఎలా ఉందంటే.. ఫస్టాఫ్ సింపుల్ & బ్యూటిఫుల్. కానీ కథ ఊహించదగినదే. దానికి నరేషన్ చాలా నెమ్మదిగా ఉంది. అయితే కథలోని ఎమోషన్ కు ఆడియెన్స్ కనెక్ట్ అవుతారు. జివి ప్రకాష్ పాటలు & సంగీతం చాలా బాగుంది. పరిచయ సన్నివేశాలు, కన్నుకుట్టి సన్నివేశం, ప్రీ ఇంటర్వెల్ సూపర్ గా ఉన్నాయి. కానీ సెకండాఫ్ రొటీన్ హీరో-విలన్ వార్ గా మారుతుంది. దానికి తోడు ఇది బలహీనంగా, సాగతీతగా ఉంటుంది.  లీడ్ రోల్స్ లో నటించిన ప్రధాన పాత్రల నటన ప్రత్యేకంగా నిలుస్తుంది. ధనుష్ మరోసారి అద్బుతంగా నటించగా, నిత్యా మీనన్ మరియు రాజ్‌కిరణ్ మంచి నటన కనబరిచారు. దర్శకుడిగా, ధనుష్ కొన్ని భావోద్వేగ క్షణాలను అందించగలిగాడు. ఓవరాల్ గా ఇడ్లీ కొట్టు పర్లేదు అనిపించే డ్రామా.  ఫస్టాఫ్ మెప్పించగా సెకండాఫ్ కాస్త డౌన్ అవుతుంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఇడ్లీ కాస్త మెత్తగా ఉడికాయి. కానీ రుచి మాత్రం ఒకసారి మాత్రమే తినేలా ఉంది.