Bobby : బాలకృష్ణతో సినిమా చేస్తే ఆయనతో ప్రేమలో పడిపోతారు

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ తన 109వ చిత్రం బాబీ దర్శకత్వంలో ‘డాకు మహారాజ్’ అనే సినిమా చేస్తున్నారు. సితార ఎంటటైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ ఈ సినిమాను భారీ బడ్జెట్ పై నిర్మిస్తున్నాడు. ఈ రోజు సాయంత్రం ఈ సినిమాలో ని సెకండ్ సాంగ్ ను రిలీజ్ చేయనున్నారు మేకర్స్. ఈ సందర్భంగా చిత్ర దర్శకుకు బాబీ, నిర్మాత నాగవంశీ ప్రెస్ మీట్ నిర్వహించారు.

దర్శకుడు బాబీ మాట్లాడుతూ ” డాకు మహారాజ్ అన్ని రకాలగా ప్రేక్షకులను మెప్పించేలా సినిమా ఉండబోతుంది. సంక్రాంతి పండుగల ఉండబోతుంది. సినిమా పూర్తిగా మేము రాసుకున్న కథ. ఒక దర్శకుడు ఏం చెప్పినా బాలకృష్ణ అందంగా, చాల బాగ చేస్తారు. బాలకృష్ణని ఈ సినిమాలో మేము ఎంతో కష్టం పెట్టారు.ఎలెవేషన్స్స్ అనేవి వేరే లెవెల్. ఒక దర్శకుడు అడిగితే సమయంతో సంబంధం లేకుండా, దర్శకుడు కావాల్సింది చేస్తారు. ఆయన వయస్సుతో సంబంధం లేకుండా మిగతా వారితో పోటీగా గుర్రం నడుపుతుంటే మేమే ఆశ్చర్యపోయాం. ఈ సినిమాలో థియేటర్ దద్దరిల్లిపోయే ఒక మాస్ సాంగ్ కూడా ఉంది. మనకు తెలిసిన ఒక రోబిన్హుడ్ క్యారెక్టర్ నుండి తీసుకున్నాము కానీ ఆ కథ కాదు. ఒక పాట చాల అద్భుతంగా ఉంటుంది. ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్. బాల కృష్ణ గారితో సినిమా చేస్తే కచ్చితంగా ఆయన ప్రేమలో పడిపోతారు. ఆయనతో పని చేసే అవకాశం ప్రతి దర్శకుడు అనుకుంటారు. బాల కృష్ణ గారికి ఇప్పటి పిల్లలు కూడా అన్ స్టాపబుల్ వల్ల ఫ్యాన్స్ అయిపోయారు. వాల్తేరు వీరయ్య తరువాత చిరంజీవి గారి అభిమానులు నాకు ఇచ్చిన ప్రేమను నేను మర్చిపోలేను. అలాంటి అభిమానం నేను ఇప్పుడు బాలకృష్ణ గారి అభిమానుల నుండి ఇప్పుడు రావాలి అనుకుంటున్నాను’ అని అన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *