రోజు రోజుకి సినిమా హీరోల అభిమానం వెర్రి అభిమానంగా మారుతుంది. సినిమా రిలీజ్ సమయంలో ఇతర హీరోలతో ఫ్యాన్ వార్స్ సోషల్ మీడియాలో హద్దులు మీరుతోంది. ఒకరిపై ఒకరు వ్యక్తిగతంగా కామెంట్స్ చేసుకుంటూ పరిథిదాటి ప్రవర్తిస్తున్నారు. తాజాగా మరో అభిమాని ఏకంగా ఆత్మహత్య చేసుకుంటాను అని బెదిరింపులకు దిగాడు. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా గేమ్ ఛేంజర్. సంక్రాంతి కానుకగా జనవరి 10న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది గేమ్ ఛేంజర్.
అయితే ఈ సినిమా మేకర్స్ పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఈశ్వర్ అనే అభిమాని రాసిన లేఖ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ లేఖలో ‘గౌరవనీయులైన గేమ్ ఛేంజర్ మేకర్స్ కు నేను అనగా ఈశ్వర్ అనే నేను చరణ్ అని ఫ్యాన్ చింతిస్తూ రాయునది ఏమనగా సినిమాకి సినిమా విడుదలకు ఇంకా 13 రోజులు మాత్రమే మిగిలి ఉన్నది. మీరు ఏ విధమైనయి వంటి ఫోటోలు గాని, అప్డేట్స్ గాని ఇవ్వట్లేదు. కనీసం అభిమానుల ఎమోషన్స్ ను కూడా పట్టించుకోవట్లేదు. ఈ నెల ఆఖరు కల్లా మీరు గేమ్ ఛేంజర్ ట్రైలర్ అప్డేట్ ఇవ్వకపోతే నూతన సంవత్సరం సందర్భంగా ట్రైలర్ రిలీజ్ చేయకపోతే నేను ఆత్మహత్యకు పాల్పడతానని సవినయంగా తెలియజేసుకుంటున్నాను. ఇట్లు, మీ విధేయుడు. చరణ్ అన్న భక్తుడు ఈశ్వర్’ అని మేకర్స్ దిల్ రాజుని బెదిరిస్తూ ఎక్స్ లో పోస్ట్ చేసాడు. సినిమా హీరోల కోసం కాదు నిన్ను కన్న తల్లిదండ్రుల కోసం ప్రాణాలు ఇవ్వండి అని నెటిజన్స్ సదరు వెర్రి ఫ్యాన్ కు చురకలు అంటిస్తున్నారు.
బ్రతికుంటే అందరితో చూస్తా…
చస్తే ఆత్మ లా చూస్తా…ఇదంతా నీ చేతుల్లోనే ఉంది @GameChangerOffl 😭🙏
జై చరణ్ జై చరణ్ #RamCharan #GlobalStarRamCharan #GameChanger pic.twitter.com/ePfifI2g8g
— EshwaRC15 Raj(Dhfc) 🚁🚁 (@EshwarDhfc) December 27, 2024