• ఆస్ట్రేలియా, భారత్‌ నాలుగో టెస్టు
  • తుది జట్టును ప్రకటించిన ఆస్ట్రేలియా
  • సామ్‌ కాన్ట్సాస్‌కు అవకాశం

బోర్డర్‌-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో భాగంగా గురువారం నుంచి మెల్బోర్న్ వేదికగా ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య నాలుగో టెస్టు ప్రారంభం కానుంది. ఐదు టెస్ట్ మ్యాచుల సిరీస్ 1-1తో సమంగా ఉన్న నేపథ్యంలో బాక్సింగ్ డే టెస్ట్ కీలకంగా మారింది. ఈ టెస్టులో గెలిచి సిరీస్‌లో ఆధిక్యం సాధించాలని ఇరు జట్లు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా, భారత్ జట్లు బలమైన జట్లతో బరిలోకి దిగుతున్నాయి. బాక్సింగ్‌ డే టెస్టు కోసం ఆసీస్ తన తుది జట్టును ప్రకటించింది. 19 ఏళ్ల సామ్ కాన్ట్సాస్‌కు అవకాశం ఇచ్చింది.

బాక్సింగ్‌ డే టెస్టు కోసం ఆస్ట్రేలియా మేనేజ్‌మెంట్ రెండు మార్పులు చేసింది. ఓపెనర్ నాథన్ మెక్‌స్వీనీ స్థానంలో యువ ఆటగాడు సామ్‌ కాన్ట్సాస్‌కు అవకాశం ఇచ్చింది. గాయం కారణంగా సిరీస్‌కు దూరమైన స్టార్ పేసర్ జోష్‌ హేజిల్‌వుడ్ స్థానంలో స్కాట్ బొలాండ్‌ను మూడో ప్రధాన పేసర్‌గా తీసుకుంది. బొలాండ్‌ రెండో టెస్ట్ ఆడిన విషయం తెలిసిందే. గాయపడిన హేజిల్‌వుడ్ రావడంతో మూడో టెస్టుకు దూరమయ్యాడు. డేంజరస్‌ బ్యాటర్ ట్రావిస్ హెడ్ ఫిట్‌నెస్‌ టెస్టులో పాస్‌ కావడంతో తుది జట్టులో చోటు దక్కింది.

భారత్‌తో వార్మప్‌ మ్యాచ్‌లో ప్రైమ్‌ మినిస్టర్స్‌ ఎలెవన్ జట్టు తరఫున సామ్‌ కాన్ట్సాస్‌ ఆడాడు. 97 బంతుల్లో 107 రన్స్ చేశాడు. మహమ్మద్ సిరాజ్‌, రవీంద్ర జడేజా వంటి బౌలర్లను ఎదుర్కొని సెంచరీ సాధించాడు. ఇక బాక్సింగ్ డే టెస్టులో ఆస్ట్రేలియా తరఫున ఉస్మాన్ ఖవాజాతో కలిసి అతడు ఇన్నింగ్స్‌ను ఆరంబించనున్నాడు. మెక్‌స్వీనీ విఫలమైన వేళ కాన్ట్సాస్‌ ఎలా ఆడుతాడో చూడాలి.

ఆస్ట్రేలియా తుది జట్టు:
ఉస్మాన్ ఖవాజా, సామ్ కొన్ట్సాస్, మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ కేరీ (వికెట్ కీపర్), పాట్ కమిన్స్ (కెప్టెన్), మిచెల్ స్టార్క్, నాథన్ లైయన్, స్కాట్ బొలాండ్.

 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *