“కాంతార” ప్రీక్వెల్ పై ఇంట్రెస్టింగ్ బజ్! | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings

కన్నడ సినిమా దగ్గర సెన్సేషనల్ హిట్ అయినటువంటి పలు చిత్రాల్లో గత రెండేళ్ల కితం వచ్చిన పాన్ ఇండియా డివోషనల్ హిట్ చిత్రం “కాంతార” కూడా ఒకటి. మరి రిషబ్ శెట్టి హీరోగా తన స్వీయ దర్శకత్వంలోనే తెరకెక్కించిన ఈ భారీ చిత్రం రికార్డ్ వసూళ్లు సాధించి అదరగొట్టింది. ఇక ఈ చిత్రానికి మేకర్స్ కొనసాగింపుగా రెండో సినిమాని కూడా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.

మరి ఈ సినిమా సీక్వెల్ గా కాకుండా ప్రీక్వెల్ గా తీసుకొస్తున్నారు. అయితే పార్ట్ 1 కంటే ఎంతో గ్రాండ్ గా భారీ బడ్జెట్ తో ప్లాన్ చేస్తున్న ఈ సినిమా ఇప్పుడు శరవేగంతో పూర్తవుతుంది. ఇలా ఈ సినిమా రిలీజ్ పై క్లారిటీ వినిపిస్తుంది. దీనితో కాంతార ప్రీక్వెల్ వచ్చే ఏడాది ఆగస్ట్ రిలీజ్ కి రానున్నట్లు తెలుస్తోంది. మరి దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

The post “కాంతార” ప్రీక్వెల్ పై ఇంట్రెస్టింగ్ బజ్! first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *