పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మాళవిక మోహనన్ అలాగే నిధి అగర్వాల్ హీరోయిన్ గా దర్శకుడు మారుతీ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం “ది రాజా సాబ్” కోసం అందరికీ తెలిసిందే. ఒక సాలిడ్ ఫాంటసీ హారర్ థ్రిల్లర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా భారీ అంచనాలు ఈ చిత్రంపై నెలకొన్నాయి. అయితే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతుండగా ఇపుడు ఈ సినిమా టీజర్ ట్రీట్ పై ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తుంది.
దీనితో ప్రస్తుతం మేకర్స్ టీజర్ పనులు ఆల్ మోస్ట్ ముగించే పనుల్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. అలాగే ఈ టీజర్ కట్ ని ఈ క్రిస్మస్ కానుకగా లేదా కొత్త ఏడాది ఆరంభంతో క్రేజీ ట్రీట్ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి దీనిపై ఓ క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మాణం వహిస్తుండగా వచ్చే ఏడాది ఏప్రిల్ లో సినిమా రిలీజ్ కి తీసుకొస్తున్నారు.
The post “ది రాజా సాబ్” టీజర్ పై ఇంట్రెస్టింగ్ బజ్! first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.