Published on Jan 2, 2025 5:16 PM IST
గ్లోబల్ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబుల కలయికలో ఇప్పుడు అవైటెడ్ భారీ ప్రాజెక్ట్ ని చేస్తున్న సంగతి తెలిసిందే. మహేష్ బాబు కెరీర్ లో 29వ సినిమాగా ప్లాన్ చేస్తున్న ఈ సినిమాని మేకర్స్ ఒక గ్లోబ్ ట్రాటింగ్ అడ్వాంచర్ థ్రిల్లర్ గా ప్లాన్ చేస్తున్నారు.
మరి నేడు ముహూర్త కార్యక్రమాలతో మొదలు కాబోతున్న ఈ చిత్రం కోసం అభిమానులు ఇంకో రెండే మూడేళ్లు లేదా నాలుగేళ్లు ఆగిపోవాల్సిందే అని మెంటల్ గా కూడా ప్రిపేర్ అయ్యిపోయారు. మరి వీటికి తగ్గట్టుగానే పలు క్రేజీ రూమర్స్ ఈ సెన్సేషనల్ ప్రాజెక్ట్ పై మొదలయ్యాయి.
వీటితో ఈ సినిమాని రెండు భాగాలుగా రిలీజ్ చేయడం ఖరారు అన్నట్టు తెలుస్తుంది. అలాగే వీటిలో మొదటి భాగాన్ని ఈ 2027లో రిలీజ్ కి తీసుకొస్తే రెండో భాగాన్ని 2029 లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. దీనితో ఈ క్రేజీ ప్రాజెక్ట్ రిలీజ్ విషయంలో మేకర్స్ ముందు నుంచీ ప్లానింగ్ లోనే ఉన్నారని చెప్పొచ్చు.