కోలీవుడ్ సినిమా స్టార్ హీరోస్ లో టాలెంటెడ్ నటుడు సూర్య కూడా ఒకరు. మరి సూర్య హీరోగా నటించిన ఎన్నో బిగ్ హిట్ చిత్రాల్లో అందులోని కొన్ని ఐకానిక్ పాత్రల్లో “గజినీ” కూడా ఒకటి. దర్శకుడు ఏ ఆర్ మురుగదాస్ కాంబినేషన్ లో చేసిన ఈ చిత్రం అప్పట్లో సంచలన విజయం సాధించింది. అలాగే ఈ చిత్రాన్ని హిందీలో కూడా రీమేక్ చెయ్యగా అక్కడ రికార్డు వసూళ్లు కొల్లగొట్టింది.
స్టార్ హీరో అమీర్ ఖాన్ తో ఏ ఆర్ మురుగదాస్ నే చేసిన ఈ చిత్రంకి సీక్వెల్ పై కొన్నాళ్ల కితం పలు రూమర్స్ వచ్చాయి. అలాగే ఈ రూమర్స్ ఇపుడు నిజం అయ్యేలా ఉన్నాయని చెప్పాలి. మురుగదాస్ తమిళ్ సహా హిందీలో గజినీ 2 తియ్యనున్నారని టాక్ వైరల్ గా మారింది. అలాగే సూర్య కూడా హింది గజినీ పార్ట్ 2లో అమీర్ తో కనిపిస్తాను అని కంగువా హిందీ ప్రమోషన్స్ లో భాగంగా తెలిపినట్టుగా ఓ స్టేట్మెంట్ కూడా వైరల్ గా మారింది. మరి ఈ క్రేజీ సీక్వెల్ పై మరింత క్లారిటీ రావాల్సి ఉందని చెప్పాలి.
The post “గజినీ 2” పై ఇంట్రెస్టింగ్ టాక్.! first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.