Published on Dec 1, 2024 10:01 AM IST

కమర్షియల్ డైరెక్టర్ మారుతి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ తో ‘ది రాజా సాబ్’ అనే భారీ పాన్ ఇండియా సినిమాని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఈ మూవీ హీరోయిన్ మాళవిక మోహనన్ ఓ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తైనట్లు ఆమె తెలిపారు. అదేవిధంగా ప్రభాస్ తన ఫేవరెట్ హీరో అని ఆమె చెప్పారు. దర్శకుడు మారుతి ఒక్కరోజు కూడా వృథా కాకుండా ఈ సినిమా చిత్రీకరణ చేస్తున్నారని… అనుకున్న సమయంలో సినిమాను విడుదల చేయాలని టీమ్ పట్టుదలతో ఉన్నారని ఆ మధ్య ఎస్‌కెఎన్‌ కూడా తెలిపారు.

ఇప్పుడు షూటింగ్ గురించి హీరోయిన్ మాళవిక మోహనన్ కూడా ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తైనట్లు చెప్పింది. దీని బట్టి దర్శకుడు మారుతి ఈ సినిమా ప్లానింగ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు అర్థం అవుతుంది. ఇక ఈ మూవీలో నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 10న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *