మన ఇండియన్ సినిమా దగ్గర ఉన్నటువంటి క్రేజీ హారర్ థ్రిల్లర్ చిత్రాల్లో ఆల్ టైం క్లాసిక్ సినిమా ఏదన్నా ఉంది అంటే డెఫినెట్ గా “తుంబాడ్” అనే చెప్పాలి. మరి ఎప్పుడో 2018లో ఈ చిత్రం అపుడు సరైన ఆదరణ అందుకోలేదు కానీ ఆ తర్వాత మాత్రం ఒక అండర్ రేటెడ్ జెమ్ గా నిలిచిపోయింది.
దీనితో ఈ మధ్యన రీ రిలీజ్ కి ఈ చిత్రాన్ని తీసుకురాగా ఇప్పుడు భారీ సక్సెస్ అయ్యింది. అయితే ఈ సినిమాకి సీక్వెల్ ని ఈ రీరిలీజ్ లోనే మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేయగా ఇపుడు దీనిపై ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకి వచ్చింది. మొదటి భాగంలో నటుడు సోహుమ్ షా సాలిడ్ పెర్ఫామెన్స్ ని అందించిన సంగతి తెలిసిందే.
మరి తాను పార్ట్ 2 కి కూడా వర్క్ చేస్తున్నట్టుగా రీసెంట్ గా తెలిపాడు. మరి తన పోస్ట్ చూస్తే ఈ క్రేజీ సీక్వెల్స్ సెకండ్ పార్ట్ లో స్క్రిప్ట్ సహకారం కూడా అందిస్తున్నాడా అనిపిస్తుంది. ఇక ఈ చిత్రాన్ని దర్శకుడు అనీల్ రాహి బర్వె తెరకెక్కిస్తుండగా తాను ఇపుడు చేస్తున్న వెబ్ సిరీస్ “రక్త బ్రహ్మాండ్” తర్వాత తుంబాడ్ ని తెరకెక్కించనున్నారు.
Haan Tumbbad 2 pe hi kaam kar raha hu pic.twitter.com/ACcS9IAPiV
— Sohum Shah (@s0humshah) December 23, 2024
The post “తుంబాడ్ 2” పై ఇంట్రెస్టింగ్ అప్డేట్..! first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.