Published on Jan 3, 2025 2:02 PM IST
మన టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా త్రిష హీరోయిన్ గా దర్శకుడు వశిష్ట తెరకెక్కిస్తున్న అవైటెడ్ చిత్రం “విశ్వంభర”. అయితే అన్నీ సరిగ్గా సెట్ అయి ఉంటే ఈ జనవరి 10న విశ్వంభర హంగామా ఓ రేంజ్ లో ఉండేది. అయితే ఈ సినిమా టీజర్ రిలీజ్ తర్వాత వచ్చిన మిక్స్డ్ రెస్పాన్స్ తో మేకర్స్ కొంచెం వెనకడుగు వేశారు. మెయిన్ గా వి ఎఫ్ ఎక్స్ పరంగా వచ్చిన కామెంట్స్ పై తగు జాగ్రత్తలు ఇపుడు తీసుకుంటున్నారట.
ఇలా ప్రస్తుతం గతంలో వర్క్ చేసిన గ్రాఫికల్ టీం ని తీసి కొత్త టీం ని సెట్ చేసినట్టుగా తెలుస్తుంది. దీనితో కొంచెం బెటర్ గా విజువల్స్ ని వీరు అందిస్తారని మేకర్స్ భావిస్తున్నారట. నిజానికి టీజర్ లో మరీ అంత నెగిటివ్ చేసే రేంజ్ లో విజువల్స్ లేవు కానీ సోషల్ మీడియాలో జరిగిన నెగిటివిటీకి మేకర్స్ రిస్క్ తీసుకోకుండా ముందే మార్పులు చేర్పులు చేస్తున్నారని చెప్పాలి. ఇక ఈ సినిమాకి ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా యూవీ క్రియేషన్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.