Thu. Mar 26th, 2026
IPL 2026 vs Peddi: ఐపీఎల్ ఫీవర్ మధ్య రిలీజ్.. రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమాకి అసలైన పరీక్ష తప్పదా?

IPL 2026 vs Peddi: వేసవి సీజన్ అంటే సినిమాలకు మంచి సువర్ణావకాశం. ఎన్నో ఏళ్లుగా సమ్మర్ హాలిడేస్‌ను చాలా సినిమాలు టార్గెట్ చేస్తూ వచ్చాయి. అయితే కొన్నేళ్లుగా ఇదే సమయంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కూడా ప్రారంభం కావడంతో.. థియేటర్లపై పెను ప్రభావం పడుతోంది. సినిమాలకు ఇదేమీ కొత్త విషయం కాదు. అయితే ఏప్రిల్ 30న రిలీజ్‌కు సిద్ధమవుతున్న ‘మెగా పవర్ స్టార్’ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలా నిలబడుతుందో అన్నది ఆసక్తికరంగా మారింది.

ఐపీఎల్ 2026 మార్చి 28న ప్రారంభం అవుతుంది. ఏప్రిల్ చివరి వారానికి వచ్చే సరికి ఐపీఎల్ పీక్‌లో ఉంటుంది. టాప్-4లో చోటు కోసం అన్ని టీమ్స్ గట్టిగా పోటీపడుతాయి. దాంతో మ్యాచ్‌లు రసవత్తరంగా సాగుతుంటాయి. ఆ సమయంలో క్రికెట్ అభిమానులు ఎక్కువగా మ్యాచ్‌లకే ప్రాధాన్యం ఇస్తారు. ఈ నేపథ్యంలో నైట్ షోస్‌కు థియేటర్లలో ప్రేక్షకుల సంఖ్య భారీగా తగ్గిపోతుంది. గతంలో కూడా ఐపీఎల్ ప్రభావం సినిమాల కలెక్షన్లపై స్పష్టంగా కనిపించింది. ఈ నేపథ్యంలో ‘పెద్ది’ వంటి బిగ్ సినిమా విడుదల అవ్వడం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.

Additionally Learn: India Lok Sabha Seats Building up: లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలు 50 శాతం పెంపు.. 2029 ఎన్నికల నుంచే అమలు, తెలంగాణలో ఎన్ని పెరుగుతాయంటే?

స్టార్ కాస్ట్, భారీ అంచనాలు ఉన్న సినిమాలపై కూడా ఐపీఎల్ ఎఫెక్ట్ భారీగా పడింది. మరి రామ్ చరణ్ ‘పెద్ది’పై ఎంతవరకు ప్రభావం ఉంటుందన్నది ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది. ముఖ్యంగా వీకెండ్ కాకుండా వర్కింగ్ డేస్‌లో ఈ ప్రభావం మరింత ఎక్కువగా ఉండే అవకాశముంది. పెద్ది సినిమాను బాక్సాఫీస్‌కు పరీక్షలా ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. ఐపీఎల్ ఫీవర్ మధ్య కూడా.. ప్రేక్షకులను పెద్ది మూవీ థియేటర్లకు రప్పించగలదా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఒకవేళ మంచి టాక్ వస్తే.. ఐపీఎల్ ప్రభావాన్ని తట్టుకుని మంచి కలెక్షన్లు సాధించే అవకాశం ఉంది. లేదంటే పెద్దిపై ప్రభావం పడటం ఖాయం. ఇప్పటికే ‘గేమ్ ఛేంజర్’తో చరణ్ భారీ ప్లాఫ్ అందుకున్న విషయం తెలిసిందే.