Published on Dec 14, 2024 11:37 PM IST
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం “పుష్ప 2” తో ఆల్ ఇండియా వైడ్ గా రికార్డులు తిరగరాస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం విడుదల తర్వాత అల్లు అర్జున్ విషయంలో ఎలాంటి ఘటనలు జరిగాయో అందరికీ తెలిసిందే. మరి తన అరెస్ట్ అనంతరం బన్నీ విడుదల అయ్యి వచ్చాక తన కోసం తెలుగు సహా కన్నడ నటులు కూడా వచ్చారు. మరి వారిలో కన్నడ విలక్షణ నటుడు అలాగే దర్శకుడు ఉపేంద్ర కూడా రావడం జరిగింది.
అయితే ఉపేంద్ర హీరోగా తన దర్శకత్వంలోనే తెరకెక్కించిన లేటెస్ట్ చిత్రం “యూఐ”. తన మార్క్ ఆలోచనతో వస్తున్న ఈ భారీ సినిమా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కి రాబోతుంది. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ కోసం ఐకాన్ స్టార్ వచ్చే ఛాన్స్ ఉన్నట్టుగా ఇపుడు బజ్ వినిపిస్తుంది. ఈ డిసెంబర్ 20న సినిమా రిలీజ్ ఉండగా ఈ గ్యాప్ లో ఓ డేట్ కి తెలుగు ప్రీ రిలీజ్ ని ఫిక్స్ చేయనున్నారు దీనికి బన్నీ హాజరు అయ్యే ఛాన్స్ ఉన్నట్టుగా ఇపుడు టాక్. మరి దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది.