Published on Dec 13, 2024 1:06 PM IST
ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు సుకుమార్ తో భారీ పాన్ ఇండియా చిత్రం “పుష్ప 2” చేసి ఎలాంటి హిట్ కొట్టారో తెలిసిందే. మరి భారీ అంచనాలు నడుమ వచ్చిన ఈ చిత్రం వాటిని రీచ్ అయ్యి సంచలన వసూళ్లు ప్రపంచ వ్యాప్తంగా అందుకుంది. అయితే ఈ సినిమా రిలీజ్ కి ముందు రోజే డిసెంబర్ నాలుగు రాత్రి నుంచి తెలుగు రాష్ట్రాల్లో పైడ్ ప్రీమియర్స్ ని మేకర్స్ వేసిన వేసిన సంగతి తెలిసిందే.
మరి ఈ ప్రీమియర్స్ లో సంధ్య 70 ఎం ఎం థియేటర్ దగ్గర విషాద ఘటన తీవ్ర దుమారం రేపింది. మరి ఈ ఘటనపై అల్లు అర్జున్ కూడా స్పందించి ఆ కుటుంబానికి అండగా ఉంటానని కూడా చెప్పుకొచ్చాడు. మరి ఈ విషయంలో బాధిత కుటుంబం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఫైల్ చేయగా మొదటగా థియేటర్ యాజమాన్యం ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అయితే ఇపుడు లేటెస్ట్ గా అల్లు అర్జున్ ని చిక్కడపల్లి పోలీసులు వారు అరెస్ట్ చేశారు అంటూ పలు వార్తలు బయటకు వచ్చాయి. అయితే దీనిపై క్లారిటీ తెలుస్తుంది. అల్లు అర్జున్ వారు కేవలం విచారణ నిమిత్తం మాత్రమే తీసుకెళ్లడం జరిగింది అని అది అరెస్ట్ కాదని తెలుస్తుంది. అల్లు అర్జున్ విచారణ నిమిత్తం తన సహకారం తోనే వెళ్లడం జరిగిందని తెలుస్తుంది. దీనితో అల్లు అర్జున్ ని అరెస్ట్ చేశారు అనే మాటలో నిజం లేదని చెప్పాలి.