Published on Oct 24, 2024 7:02 AM IST
టాలీవుడ్ నుంచి మున్ముందు రాబోతున్న పలు భారీ సినిమాల్లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా మావెరిక్ దర్శకుడు శంకర్ కాంబినేషన్లో చేస్తున్న సెన్సేషనల్ ప్రాజెక్ట్ “గేమ్ ఛేంజర్” కూడా ఒకటి. మరి ఇండియన్ సినిమా దగ్గర రాజమౌళి, శంకర్ లతో వర్క్ చేసిన ఏకైక హీరోగా చరణ్ నిలవగా మెగా అభిమానులు ఈ ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ కోసం చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు.
అయితే ఇందుకు తగ్గట్లుగానే ఈ భారీ సినిమా తెలుగు రాష్ట్రాల్లో భారీ బిజినెస్ ని చేస్తున్నట్టు రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇలా ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే గేమ్ ఛేంజర్ 150 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్ చేస్తున్నట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే ఈ మార్క్ డిసెంబర్ రిలీజ్ టైం కి అనుకున్నప్పుడు లేదని తెలుస్తోంది. సినిమా సంక్రాంతికి షిఫ్ట్ చేయడంతో అప్పటికి ఇప్పటికీ బిజినెస్ లెక్కల్లో మార్పులు వచ్చాయట!? దీనితో ఇపుడు గేమ్ ఛేంజర్ మాత్రం భారీ బిజినెస్ ని క్లాక్ చేస్తున్నట్టుగా చెప్పాలి.