- ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్న రవితేజ డాటర్
- అసిస్టెంట్ డైరెక్టర్ గా రవితేజ కూతురు
- సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లో సినిమా
Ravi Teja Daughter : చిత్ర పరిశ్రమ అనేది రంగుల ప్రపంచం, అందులోకి ఎంట్రీ ఇవ్వాలంటే టాలెంట్ మాత్రమే కాదు, ఎక్స్ పీరియన్స్ కూడా కావాలి. ప్రత్యేకించి, స్టార్ వారసులు తమంటే ఏంటో నిరూపించుకోవాలంటే 24 క్రాఫ్ట్ పై అవగాహన కలిగి ఉండడం చాలా ముఖ్యం. ఈ నేపథ్యంలో రవితేజ కూతురు మోక్షధ సైతం తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించేందుకు రెడీ అవుతుంది. ఆమె నటనకు బదులుగా దర్శకత్వ శాఖపై ఆసక్తి చూపుతుంది. ప్రస్తుతం సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాణంలో ఉన్న ఓ సినిమాలో అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తోందట. మోక్షధ ఈ దిశగా వేస్తున్న అడుగులు ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం టాలీవుడ్‌లో, కొత్త తరానికి చెందిన వారసులు డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో పని చేస్తూ తమకు అవసరమైన అనుభవాన్ని సంపాదించుకుంటున్నారు. ఇదే తరహాలో మోక్షధ కూడా పని చేస్తుండంతో, ఆమెలోని ఆర్టిస్టిక్ సైడ్ మరింత బయటపడుతుందని అంతా భావిస్తున్నారు. నటనలో కాకుండా, తెర వెనుక ఓ సక్సెస్ ఫుల్ డైరెక్టర్‌గా ఎదగాలనే ఆమె ఆలోచన ప్రత్యేకమనే చెప్పాలి.
Read Also:Car Price Hike Alert: కారు కొందామనుకుంటున్నారా? అయితే వెంటనే కొనండి.. ఆలస్యమైతే ఇక బాదుడే
రవితేజ తన పిల్లలకు నేర్పిన గుణం ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది. టాలీవుడ్ స్టార్ పిల్లలలో ఎక్కువగా విదేశాల్లో కోర్సులు చేసి వచ్చి డైరెక్షన్లో అడుగుపెడుతున్నారు. కానీ రవితేజ పిల్లలు ఇండస్ట్రీలోనే మెళకువలు నేర్చుకుంటూ, నేరుగా పని నేర్చుకుంటున్నారు. మోక్షధకు ఇది కేవలం డైరెక్షన్ మాత్రమే కాదు, సినిమాకు సంబంధించిన అన్ని క్రాఫ్ట్స్‌పై అవగాహన పెంచుకునే అవకాశంగా చెప్పవచ్చు. ఇక ఆమె సోదరుడు మహాధన్ కూడా ఈ దిశలోనే ముందుకు సాగుతున్నట్లు సమాచారం. మహాధన్ నటనతో పాటు డైరెక్షన్లో కూడా ట్రైనింగ్ తీసుకుంటున్నాడట. రాజా ది గ్రేట్ లో చిన్నప్పటి రబితేజగా మహాధన్ నటించిన విషయం తెలిసిందే. ఇక టాలీవుడ్‌లో ఇప్పటికే చాలామంది యంగ్ స్టార్లు డైరెక్ట్‌గా కెమెరా ముందుకు రాకముందే సీనియర్ డైరెక్టర్ల వద్ద ట్రైనింగ్ తీసుకున్నారు.
Read Also:Minister Satya Kumar Yadav: ‘వన్ నేషన్-వన్ ఎలక్షన్’ బిల్లు.. ప్రధాని మోడీ దార్శనికతకు గుర్తు
కీరవాణి కుమారుడు శ్రీ సింహ సుకుమార్ దగ్గర సహాయ దర్శకుడిగా పనిచేసి అనుభవం సాధించాడు. అదే తరహాలో మహాధన్ కూడా ప్రముఖ డైరెక్టర్ల వద్ద శిక్షణ తీసుకుంటూ తన రూట్ సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. రవితేజ సినీ ప్రయాణం తమ పిల్లలకు ఇన్‌స్పిరేషన్‌గా మారినట్లు స్పష్టం అవుతుంది. రవితేజ కూడా తన కెరీర్ ప్రారంభంలో డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో పని చేసిన సంగతి తెలిసిందే. అనుకోకుండా నటుడిగా మారి, తరువాత స్టార్‌గా ఎదిగారు. ఇప్పుడు ఆయన వారసులు కూడా అదే శైలిని అనుసరించి తమెంటో రుజువు చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు.