శృతిహాసన్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కమల్ హాసన్ కుమార్తెగా సినీ ప్రపంచానికి పరిచయమైన ఆమె తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. మధ్యలో ప్రేమ వ్యవహారం నడిపి సినీ పరిశ్రమకు పూర్తిగా దూరమైన ఆమె ఆ తర్వాత మళ్లీ సినిమాల్లో బిజీ అయింది. చివరిగా ఆమె ప్రభాస్ హీరోగా నటించిన సలార్ సీజ్ ఫైర్ పార్ట్ వన్ లో కనిపించింది. తర్వాత అడివి శేష్ హీరోగా నటిస్తున్న డెకరేట్ సినిమాలో నటించాల్సి ఉంది కానీ యాటిట్యూడ్ కారణాలు అని చెబుతూ ఆమె తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఆమె స్థానంలో మృణాల్ ఠాకూర్ ను రంగంలోకి దించారు. అయితే ఆమె కేవలం డెకాయిట్ సినిమా మాత్రమే కాదు మరో రెండు సినిమాల నుంచి కూడా తప్పుకున్నట్లు తెలుస్తోంది. అందులో ఒకటి కన్నడ సినిమా కాగా మరొకటి ఇంటర్నేషనల్ లెవెల్ లో తెరకెక్క వలసిన చెన్నై స్టోరీ అనే సినిమా.

Ram Charan: అమెరికాలో రామ్ చరణ్ అయ్యప్ప దీక్ష విరమణ

అయితే సినిమాల నుంచి ఆమె తప్పుకుంటుందా లేక తప్పిస్తున్నారా అనే విషయం మీద మాత్రం క్లారిటీ లేదు. ఎందుకంటే శృతిహాసన్ తో పనిచేయడం చాలా కష్టమని ఆమెతో సినిమాలు చేసిన నటీనటులు చెబుతున్నారు. ఒకసారి ఆ కారణం వల్లే ముందుగా తెలియక ఆమెను తీసుకున్నా సరే విషయం అర్థమైన తర్వాత ఆమెను సైడ్ పెడుతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. మొత్తం మీద ఏదైతేనేం ఆమెను తప్పిస్తేనేమిటి? తప్పుకుంటేనేమిటి? మొత్తానికి ఆమె సినిమాల నుంచి పూర్తిగా పక్కకు వచ్చేస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని సరిదిద్దుకోకపోతే తన తండ్రి కమలహాసన్ లాగా లాంగ్ రన్ అయితే ఇక్కడ కష్టమే. ఎందుకంటే హీరోయిన్లకు మామూలుగానే టైం పీరియడ్ తక్కువ ఉంటుంది. దానికి తోడు ఇలాంటి కంప్లైంట్స్ వస్తే సినిమాలు ఆమెకు లభించే అవకాశం అయితే కష్టమే అని చెప్పవచ్చు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *