వైరల్: హ్యాండ్సమ్ మేకోవర్ తో అదరగొట్టిన బాలయ్య వారసుడు | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings

Published on Dec 8, 2024 11:00 AM IST

నటసింహం బాలయ్య బాబు వారసుడు నందమూరి మోక్షజ్ఞ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మొదటి సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఐతే, ఈ సినిమా ఓపెనింగ్ అనేది అనివార్య కార‌ణాల వ‌ల్ల ఆగిపోయింది. ఐతే, ఈ సినిమా ఆగిపోవ‌డానికి కార‌ణం ప్ర‌శాంత్ వ‌ర్మ‌ ఇంకా పూర్తి స్థాయిలో క‌థ సిద్ధం చేయ‌లేద‌ని టాక్‌ వినిపించింది. ఆ తర్వాత మోక్ష‌జ్ఞ ఆరోగ్యం బాగాలేదని.. అతను కోలుకున్నాక, సినిమా స్టార్ట్ అవుతుందని వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ క్రమంలో తాజాగా వినిపిస్తున్న టాక్ ప్రకారం.. ప్ర‌శాంత్ వ‌ర్మ‌ రెడీ చేసిన బౌండెడ్ స్క్రిప్టు బాలయ్యకి నచ్చలేదు అని, స్క్రిప్ట్ లో బాలయ్య మార్పులు చెప్పాడని.. ప్ర‌శాంత్ వ‌ర్మ‌ ఆ మార్పులు చేశాక, ఆ వెర్షన్ బాలయ్యకి నచ్చితే అప్పుడు సినిమా స్టార్ట్ అవుతుందట. ప్రస్తుతం ప్ర‌శాంత్ వ‌ర్మ‌ స్క్రిప్ట్ పనుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. అన్నట్టు మోక్ష‌జ్ఞ ప్ర‌స్తుతం ఆదిత్య 999పై ఫోక‌స్ పెట్టాడట. ఈ సినిమాకి బాల‌కృష్ణ స్వ‌యంగా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌డం విశేషం.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *