పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా దర్శకుడు జ్యోతి కృష్ణ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం కోసం “హరిహర వీరమల్లు” కోసం అందరికీ తెలిసిందే. మరి ఎన్నో అంచనాలు ఉన్న ఈ చిత్రం షూటింగ్ దాదాపు కంప్లీట్ కాబోతుండగా ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ సింగిల్ ని ఎప్పుడు నుంచో రిలీజ్ కి వస్తుంది అని టాక్ ఉంది. అయితే ఇపుడు ఫైనల్ గా ఈ సాంగ్ పై మళ్ళీ బజ్ వినిపిస్తుంది.
దీని ప్రకారం ఈ క్రిస్మస్ కానుకగా లేదా జనవరి 1 కొత్త సంవత్సరం కానుకగా వచ్చే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది. మరి దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా ఫస్ట్ సింగిల్ గా పవన్ పాడిన పాటే రానుంది అని ఎప్పుడు నుంచో టాక్ ఉంది. మరి ఈ అవైటెడ్ సాంగ్ ఎపుడు వస్తుందో చూడాలి. ఇక ఈ భారీ చిత్రాన్ని ఏ ఎం రత్నం నిర్మాణం వహిస్తుండగా రానున్న మార్చ్ 28న సినిమా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కి రాబోతుంది.
The post “వీరమల్లు” ఫస్ట్ సింగిల్ ఇప్పుడైనా వచ్చేనా? first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.