లేటెస్ట్ వరల్డ్ వైడ్ ఓటిటిలో రిలీజ్ కి వచ్చిన లేటెస్ట్ సిరీస్ లలో దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ కి వచ్చిన సిరీస్ “స్క్విడ్ గేమ్ సీజన్ 2” కూడా ఒకటి. మరి గతంలో వచ్చిన సీజన్ 1 ఓటిటిలో రికార్డు రెస్పాన్స్ తో అదరగొట్టగా ఇపుడు సీజన్ 2 మాత్రం ఆడియెన్స్ ని డిజప్పాయింట్ చేసింది అని చెప్తున్నారు. ఇక ఈ సీజన్ కి కూడా కొనసాగింపుగా సీజన్ 3ని మేకర్స్ కన్ఫర్మ్ చేశారు.
అలాగే లేటెస్ట్ గా నెట్ ఫ్లిక్స్ వారు కూడా ఈ 2025 లోనే వస్తుంది అని తెలిపారు. అయితే ఈ సీజన్ 3పై ఓ ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తుంది. దీనితో ఈసారి సీజన్లో ప్రముఖ హాలీవుడ్ హీరో టైటానిక్ ఫేమ్ లియోనార్డో డికాప్రియో కీలక పాత్రలో కనిపిస్తారని వినిపిస్తుంది. దీనితో ఈ టాక్ మరింత ఆసక్తిగా మారింది. ఇప్పుడు వరకు రెండు సీజన్లలో మొత్తం కొరియన్ నటులే కనిపించారు. మరి ఇది కొంచెం కొత్త ఎడిషన్ అని చెప్పాలి. ఒకవేళ తాను ఉంటే ఎలాంటి రోల్ లో కనిపిస్తారో చూడాలి.
The post “స్క్విడ్ గేమ్ 3″లో “టైటానిక్” హీరో? first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.