
ధడక్ సినిమాతో బాలీవుడ్‌కు హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఇషాన్ ఖట్టర్, ప్రస్తుతం “ది రాయల్స్” వెబ్ సిరీస్‌తో మళ్లీ హైలైట్‌లోకి వచ్చాడు. అయితే ఇటీవలె 2020లో వచ్చిన తన వెబ్ సిరీస్ A Suitable Boy గురించి మాట్లాడిన ఆయన, అందులో టబుతో ఉన్న సన్నిహిత సన్నివేశాల గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
టబుతో నటించినప్పుడు తమ మధ్య ఉన్న 24 ఏళ్ల వయసు తేడా గురించి ఎప్పుడూ చర్చించలేదని చెప్పారు. “ఆ కథలో ఆ సన్నివేశానికి బలం ఉంది. టబు లాంటి అనుభవజ్ఞురాలితో నటించడం వల్ల ఎలాంటి ఇబ్బంది లేకుండా షూటింగ్ పూర్తైంది. నేను చాలా సేఫ్‌గా ఫీల్ అయ్యాను,” అని అన్నారు. టబు సెట్లో చాలా సరదాగా ఉంటుందని, నటన విషయంలో మాత్రం పర్‌ఫెక్షన్‌కి ప్రాధాన్యత ఇస్తుందని కొనియాడారు.
ఇషాన్ వ్యాఖ్యల నేపథ్యంలో మరోసారి A Suitable Boy సిరీస్ ట్రెండ్ అవుతోంది. వయస్సు మీదున్న కథానాయికలతో యువ నటులు నటించడం ఇప్పుడు బాలీవుడ్‌లో ఓ సాధారణమయిన విషయం అయిపోయిందన్న అభిప్రాయాలు సోషల్ మీడియాలో వ్యక్తమవుతున్నాయి.