సంక్రాంతి సీజన్ టాలీవుడ్ కి నిజంగా పెద్ద పండుగే. అందుకే, భారీ సినిమాలు సంక్రాంతి టార్గెట్ గా బరిలోకి దిగుతాయి. మూడు నాలుగు భారీ సినిమాలు ఒకే వారంలో వచ్చినా అన్ని సినిమాలకు మంచి కలెక్షన్స్ వస్తాయి. అయితే, ‘పుష్ప-2’ సినిమా ప్రీమియర్స్ సమయంలో జరిగిన విషాదం నేపథ్యంలో తెలంగాణలో బెనిఫిట్ షోలకు అనుమతిని ఇచ్చేది లేదని, అలాగే టికెట్ రేట్ల విషయంలో కూడా షరతులు వర్తిస్తాయి అని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. కాబట్టి, తెలంగాణలో పెద్ద సినిమాలకు కష్ట కాలమే.
ఐతే, ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది ? అనేది హాట్ టాపిక్ గా మారింది. బాలయ్య, చరణ్ సినిమాలు కాబట్టి, ఏపీలో ప్రీమియర్స్, బెనిఫిట్ షోస్ కి అనుమతి ఇచ్చే అవకాశం ఉంది. ఐతే, ఏపీలో మాత్రమే మిడ్ నైట్ షోలు వేస్తే.. సినిమాలకు కొందరు యాంటీ ఫ్యాన్స్ కావాలని చేసే నెగిటివ్ ప్రచారాన్ని ఆపేది ఎలా ?, టాక్ పరంగా ఇది పెద్ద తలనెప్పే. దీనికితోడు ఒకవేళ టాక్ అటుఇటు అయ్యిందంటే.. ఇక సోషల్ మీడియాలో ఆ నెగిటివిటీ విపరీతంగా వైరల్ అవుతుంది. అప్పుడు ఆ ప్రభావం తెలంగాణలో కూడా పడే అవకాశం ఉంది. సో,, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే.. మొత్తానికి తెలుగురాష్ట్రాల్లో సంక్రాంతికి ప్రీమియర్స్, బెనిఫిట్ షోస్ ఉండకపోవచ్చు.
The post తెలుగురాష్ట్రాల్లో సంక్రాంతికి ప్రీమియర్స్ లేనట్టే ! first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.