టాలీవుడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని ప్రస్తుతం బాలీవుడ్ హీరో సన్నీ డియోల్‌తో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు ‘జాట్’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌ను మేకర్స్ ఫిక్స్ చేశారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుండి మేకర్స్ తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ రివీల్ చేశారు. ‘జాట్’ చిత్ర టీజర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేశారు.
ఈ టీజర్ ఆద్యంతం పవర్ ప్యాక్డ్ యాక్షన్ ఎపిసోడ్స్‌తో నింపేశాడు దర్శకుడు గోపీచంద్ మలినేని. యాక్షన్ హీరోగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ఉన్న సన్నీ డియోల్‌ను విధ్వంసకరంగా ప్రెజెంట్ చేస్తున్నాడు మన తెలుగు డైరెక్టర్. హీరో ఎలివేషన్ మొదలుకొని, ఆయన చేసే యాక్షన్ సీన్స్, ఆయన చెప్పే పవర్‌ఫుల్ డైలాగ్స్‌తో ఈ టీజర్ సాలిడ్‌గా ఉంది. ఇక ఈ టీజర్‌లో థమన్ మరోసారి తనదైన మార్క్ పవర్‌ఫుల్ బీజీఎంతో ఇంప్రెస్ చేశాడు.
ఇక జాట్ చిత్రంలో మరో నటుడు రణ్‌దీప్ హూడా విలన్ పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో వినీత్ కుమార్ సింగ్, రెజీనా కాసాండ్ర, సయామీ ఖేర్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ఈ చిత్రాన్ని 2025 ఏప్రిల్ నెలలో గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి
The post పవర్ ప్యాక్డ్ యాక్షన్‌తో ‘జాట్’ టీజర్ first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.