
కోట్లాది రూపాయల మోసంలో ప్రధాన నిందితుడిగా ఉన్న సుఖేశ్ చంద్రశేఖర్, 2020 జూన్ నుంచి 2021 మే వరకు మొబైల్ ఫోన్లు, వాయిస్ మాడ్యూలర్లు ఉపయోగించి ర్యాన్‌బ్యాక్సీ మాజీ యజమాని శివీందర్ సింగ్ భార్య అదితి సింగ్ ను మోసం చేశాడు. తనను లా సెక్రటరీ అనూప్‌కుమార్ గా పరిచయం చేసుకుని, ఆమె భర్తకు బెయిల్ ఇప్పిస్తానని 200 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేశాడు. ఈ మోసానికి సంబంధించిన ఆధారాలతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.
సుఖేశ్ అరెస్టైన సమయంలో, బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తో అతడి క్లోజ్ ఫోటోలు బయటకు వచ్చాయి. సుఖేశ్ ఆమెను తన ప్రియురాలిగా చెప్పుకోవడంతో, ఈ వ్యవహారం మరింత ఆసక్తికరంగా మారింది. అయితే, సుఖేశ్ తన జీవితాన్ని నరకప్రాయం చేశాడని జాక్వెలిన్ కోర్టులో వాంగ్మూలం ఇచ్చింది. అతడు ఆడుకున్నాడు, తన కెరీర్‌ను నాశనం చేశాడు అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.
అయితే, ఈ పరిణామాల తర్వాత కూడా సుఖేశ్ తన ప్రేమను ఆపలేదు. జైలులో నుంచే జాక్వెలిన్‌కు ప్రేమ లేఖలు రాస్తూనే ఉన్నాడు. ప్రతి పండుగకు ఓ ప్రత్యేక లేఖ రాస్తూ, తన ప్రేమను వ్యక్తం చేస్తున్నాడు. ఇటీవల క్రిస్మస్ కానుకగా పారిస్‌లో ఒక వైన్ యార్డ్ కానుకగా ఇస్తున్నట్లు తెలిపాడు.
ఈ వ్యవహారం బాలీవుడ్‌లో సంచలనంగా మారింది. మరి, జాక్వెలిన్ దీనిపై మరోసారి ఎలా స్పందిస్తుందో చూడాలి!