టాలీవుడ్ లో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అయ్యింది హనుమాన్ సినిమా. తేజ సజ్జ హీరోగా దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈ సినిమాను రూపొందించారు. ప్రైమ్ షో ఎంటర్ టైన్ మెంట్ సంస్థ నిర్మించింది. హనుమాన్ సినిమా రిలీజ్ టైమ్ లోనే ఈ సినిమాకు సీక్వెల్ జై హనుమాన్ అనౌన్స్ చేశారు. ఇప్పుడీ చిత్రానికి సంబంధించిన అప్డేట్ ను హనుమాన్ జయంతి సందర్భంగా ఇచ్చారు మేకర్స్.

జై హనుమాన్ సినిమాను ఐమ్యాక్స్ త్రీడీలో తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఫార్మేట్ లో వస్తున్న మొదటి తెలుగు సినిమా ఇదే. మరోవైపు హనుమాన్ సినిమా 100 డేస్ ను కూడా ఇవాళే సెలబ్రేట్ చేస్తున్నారు. ఇటీవల కాలంలో వంద రోజులు అనేది కనుమరుగు అయ్యింది. హనుమాన్ హండ్రెడ్ డేస్ రన్ కంటిన్యూ చేయడం అరుదైన విషయంగానే చెప్పుకోవచ్చు. జై హనుమాన్ లో ఏ స్టార్ కాస్టింగ్ ఉంటారు అనే విషయంలో ఆసక్తి ఏర్పడుతోంది.