
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న RC16 సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. జాన్వీ కపూర్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ మార్చి 6న ఓ స్పెషల్ పోస్టర్ విడుదల చేశారు. అయితే, ఇది ఆఫీషియల్ ఫస్ట్ లుక్ కాదని, బిహైండ్-ది-సీన్స్ స్టిల్ మాత్రమే అని క్లారిటీ ఇచ్చారు. ఈ ఫోటో మైసూర్‌లో జరిగిన మొదటి షెడ్యూల్‌లో క్లిక్ చేసినదని స్పష్టం చేశారు.
RC16 సెట్స్‌పై జాన్వీ కపూర్ ఎంట్రీపై అంచనాలు పెరుగుతున్నాయి. మైసూర్ షెడ్యూల్ పూర్తయ్యాక, కొత్త షెడ్యూల్ హైదరాబాద్‌లో ఈ నెల 7న ప్రారంభం కానుంది. 12 రోజులపాటు జరిగే ఈ షూటింగ్‌లో రామ్ చరణ్, జాన్వీ కపూర్, ఇతర నటీనటులపై కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. జాన్వీ కపూర్ ఫస్ట్ లుక్‌కి మెస్మరైజ్ అవుతారు అని టీం ధీమా వ్యక్తం చేసింది.
ఈ చిత్రంలో కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్, టాలీవుడ్ నటుడు జగపతి బాబు, మీర్జాపూర్ ఫేమ్ దివ్యేందు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందించగా, ప్రముఖ కెమెరామెన్ రత్నవేలు విజువల్స్ అందిస్తున్నారు. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్‌గా పని చేస్తున్నారు. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మిస్తున్నారు.
మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా సమర్పిస్తున్న ఈ పాన్-ఇండియా మూవీ 2025లో విడుదల కానుంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న RC16 రామ్ చరణ్ కెరీర్‌లో మరో బ్లాక్‌బస్టర్ హిట్ అవుతుందా? అన్నది చూడాల్సిందే.