ఫ్రాన్స్ వేదికగా మే 13న ప్రారంభమైన Cannes Film Festival 2025 ఎంతో అట్టహాసంగా కొనసాగుతోంది. ఈ ప్రెస్టీజియస్ ఈవెంట్‌కి బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హాజరై అందరి దృష్టిని ఆకర్షించింది. ఆమె ధరించిన మెటాలిక్ పింక్ లాంగ్ గౌన్ (long gown) సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ గౌన్‌ను ప్రఖ్యాత డిజైనర్ తారున్ తహిలియాని ప్రత్యేకంగా డిజైన్ చేయగా, దాని ఖరీదు దాదాపు రూ. 3.4 లక్షలు అని సమాచారం.
జాన్వీ కపూర్ తన స్టైలిష్ లుక్‌తో తల్లి శ్రీదేవిని గుర్తు చేస్తూ, సంప్రదాయాన్ని ప్రతిబింబిస్తూ ర్యాంప్‌పై హొయలొలికించింది. కానీ పొడవాటి గౌన్ వల్ల ఆమెకు కొంత ఇబ్బంది ఏర్పడగా, దర్శకుడు నీరజ్ ఘయ్వాన్, నటుడు ఇషాన్ ఖట్టర్ మద్దతుగా వచ్చి దుస్తులు పట్టుకుని సహాయం చేశారు. వారి సహాయంతో జాన్వీ తన గ్రేస్‌ను నిలబెట్టుకోగలిగింది.
ఈ సందర్భంగా జాన్వీ నటించిన ‘హోంబౌండ్’ (Homebound) అనే సినిమా Cannes ఫెస్టివల్‌లో ప్రత్యేక ప్రదర్శనకు ఎంపికై, అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకుంటోంది. ఇందులో ఇషాన్ ఖట్టర్, విశాల్ జెత్వా ప్రధాన పాత్రల్లో కనిపించగా, దర్శకుడు నీరజ్ ఘయ్వాన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి మార్టిన్ స్కోర్సెస్ (Martin Scorsese) నిర్మాతగా వ్యవహరించడం విశేషం.
ప్రస్తుతం జాన్వీ లుక్‌కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. Modern and traditional mix lookలో జాన్వీ చూపించిన అందం నెటిజన్లను ఫిదా చేస్తోంది.