Published on Dec 6, 2024 5:57 PM IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 ఎడి’ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ సినిమాను సైఫై మైథలాజికల్ సబ్జెక్ట్‌తో రూపొందించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఇందులోని విజువల్స్ ఆడియెన్స్‌ని కట్టిపడేశాయి. ఈ సినిమాలో భారీ క్యాస్టింగ్ కూడా నటించడంతో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించింది.

అయితే, ఇప్పుడు ఈ సినిమా జపాన్ వాసులను అలరించేందుకు రెడీ అయ్యింది. ప్రభాస్ సినిమాలకు జపాన్‌లో మంచి క్రేజ్ ఉంటుంది. దీంతో కల్కి 2898 ఎడి వంటి విజువల్ ఫీస్ట్ మూవీ వారికి ఖచ్చితంగా నచ్చుతుందనే ధీమాతో ఈ చిత్రాన్ని జపాన్ భాషలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. ఈ చిత్రాన్ని జపాన్ దేశంలో 2025 జనవరి 3న గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. అయితే, తాజాగా ‘కల్కి 2898 ఎడి’ ట్రైలర్‌ని జపనీస్ భాషలో రిలీజ్ చేశారు.

ఇక ఈ ట్రైలర్ రిలీజ్‌తో మరోసారి కల్కి 2898 ఎడి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే, దిశా పటాని, రాజేంద్ర ప్రసాద్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందించిన ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ ప్రొడ్యూస్ చేసింది. మరి ఈ సినిమా జపాన్‌లో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *