నైజాంలో “పుష్ప 2” పైడ్ ప్రీమియర్స్.. భారీ ధరతో షోస్!? | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings

Published on Dec 6, 2024 1:00 AM IST

ప్రస్తుతం దేశం మొత్తం ‘పుష్ప-2’ మేనియాతో ఊగిపోతుంది. ఈ సినిమాకు అన్ని చోట్ల పాజిటివ్ రెస్పాన్స్ వస్తుండటంతో సాలిడ్ హిట్‌గా ఈ సినిమా దూసుకెళ్తుంది. ఇక ఈ సినిమాతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ జీనియస్ సుకుమార్‌లు బాక్సాఫీస్‌ను షేక్ చేయడం ఖాయమని సినీ సర్కిల్స్ లెక్కలు వేస్తున్నారు.

ఈ సినిమాలో కీలకమైన జాతర సీన్ దేశవ్యాప్తంగా ప్రేక్షకులకు పూనకాలు తెప్పిస్తోంది. కానీ, ఇప్పుడు ఈ సినిమాలోని జాతర మాస్ సీన్‌ను తొలగించి సినిమాను ప్రదర్శిస్తున్నారట. అయితే, ఇది కేవలం సౌదీ అరేబియాలో అని తెలుస్తోంది. అక్కడి సెన్సార్ బోర్డు జాతర సీన్‌కు మతపరంగా అడ్డు చెప్పారట. దీంతో ఆ సీక్వెన్స్‌ను తొలగించిన తరువాత సెన్సార్ జారీ చేశారట.

ఇక ‘పుష్ప-2’ సినిమా ప్రస్తుతం సౌదీ అరేబియాలో జాతర సీన్ లేకుండానే ప్రదర్శించబడుతోంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ విధ్వంసకర నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *