- హీరోయిన్ మాధవీలత ప్రాస్టిట్యూట్
- జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
జేసీ దివాకర్ ట్రావెల్స్ బస్సు దగ్ధం కీలక మలుపులు తిరుగుతోంది. బస్సు దగ్ధమైన ఘటన ప్తె ఒకవైపు పోలీసుల విచారణ చేస్తుండగా, అసలు ఘటనపై ఫిర్యాదు చేయనని జెసి చెబుతున్నారు. బస్సు దగ్ధం ఘటనప్తె సుమోటోగా కేసు నమోదు చేసుకోవాలంటున్నారు. 300 బస్సులు పోతేనే ఏడ్చలేదని ఇప్పుడు ఎందుకు భాదపడతానన్నారు ఆయన మరో వ్తెపు తాడిపత్రిలో డిసెంబర్ 31 వేడుకులను నిర్వహణ ప్తె లేనిపోని ఆరోపణలు చేశారని బీజేపీ నేతల ప్తె తీవ్రస్థాయిలో జెసి ఆరోపణలు చేయడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. హీరోయిన్, బీజేపీ నాయకురాలు మాధవి లత పై జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
Pushpa 2 Effect : పోలీసుల వలయంలో సినిమా ఈవెంట్లు
మాధవి లతను ప్రాస్టిట్యూట్ అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు బీజేపీ నేతలు.. మాధవి లతని ఎందుకు పెట్టుకున్నారో తెలియదని.. ఆమె పెద్ద వేస్ట్ వ్యక్తి అంటూ కామెంట్ చేశారు. అయితే అంతకు ముందు న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా తాడిపత్రిలోని జెసి పార్క్ వైపు మహిళలు ఎవరు వెళ్లకూడదు అని మాధవి లత సూచనలు చేశారు. అక్కడ అత్యంత దారుణమైన సంఘటనలు జరుగుతున్నాయని ఆమె వీడియో రిలీజ్ చేసింది. అయితే ఈ వ్యాఖ్యలపై కౌంటర్ ఇచ్చారు జెసి ప్రభాకర్ రెడ్డి. మాధవి లత వ్యాఖ్యలను తప్పుపడుతూ మహిళలను అవమానించేలా మాధవి లత మాట్లాడారని… జేసీ పార్కులో ఎలాంటి సంఘటనలు జరగడంలేదని అన్నారు.