- మూగ జీవాలని రక్షించాలని జాన్ అబ్రహాం పిలుపు
- ఏనుగులను రక్షించాలంటూ నేపాల్ ప్రభుత్వానికి లేఖ
- చిత్వాన్ ఎలిఫెంట్ ఫెస్టివల్ నిర్వహించొద్దంటూ సూచన
John Abraham : ఇటీవల కాలంలో మెగా కోడలు ఉపాసన తన ఐస్ ల్యాండ్ పర్యటనను అర్థాంతరంగా ముగించుకుని అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది. వరుసగా దేశవిదేశాల్లో పర్యటిస్తున్న ఉపాసన ఐస్ ల్యాండ్ లో విహారయాత్రకు వెళ్లాల్సి ఉండగా.. తన ప్రయాణాన్ని రద్దు చేసుకోవడానికి కారణం.. అక్కడి ప్రభుత్వం 2000 తిమింగళాల్ని నిర్ధయగా చంపడానికి ఆదేశించడమేనని తెలిపారు. వేటగాళ్లకు లైసెన్సులు మంజూరు చేయాలని అధికారికంగా ఐస్ ల్యాండ్ ప్రభుత్వం ప్రకటించిన కారణంగా తన పర్యటనను రద్దు చేసుకున్నానని అన్నారు. ఉపాసన నిర్ణయాన్ని అభిమానులు మెచ్చకున్నారు. తనపై ప్రశంసలు వర్షం కురిపించారు. ఒక గొప్ప కాజ్(సామాజిక కారణం) కోసం తన టూర్ రద్దు చేసుకోవడాన్ని గర్వంగా చెప్పుకుంటున్నారు అభిమానులు. ఇప్పుడు అలాంటి ఒక కాజ్ కోసం బాలీవుడ్ స్టార్ హీరో జాన్ అబ్రహాం కూడా ముందుకు వచ్చారు. అడవుల్లో జీవించే తెలివైన, సున్నితమైన జంతువుల్లో ఏనుగులు ఉన్నాయి. వాటిని హింసించడం ఆపాలని ఆయన పిలుపు నిచ్చారు. జంతువులను మానసికంగా హింసిస్తూ శారీరక ఒత్తిడికి గురి చేయడం సరికాదన్నాడు. ఈ కారణంగా ‘చిత్వాన్ ఎలిఫెంట్ ఫెస్టివల్’ను రద్దు చేయాలని జాన్ అబ్రహం నేపాల్ ప్రభుత్వాన్ని కోరారు. ఆమేరకు నేపాల్ సాంస్కృతిక మంత్రిత్వ శాఖకు ఒక లేఖను పంపారు.
Read Also:YCP vs TDP: కుర్చీ కోసం వైసీపీ, టీడీపీ మధ్య వార్.. నేటి సర్వసభ్య సమావేశంకు భారీ బందోబస్తు!
చిత్వాన్ ఎలిఫెంట్ ఫెస్టివల్‌లో ఏనుగులను ఆటల పేరుతో ఒత్తిడికి గురి చేస్తున్నారని జాన్ అబ్రహాం అన్నారు. ఈ ఫెస్టివల్ కొందరికి ఆనందం కలిగించవచ్చు కానీ, ఏనుగులపై ఒత్తిడి ప్రభావం గురించి ఆందోళన చెందుతున్నానని అన్నారు. ఏనుగులు తెలివైనవి.. ఇలాంటి సున్నితమైన జంతువులతో ఆట మంచిది కాదని ఆవేదన వ్యక్తం చేశారు. వాటిపై శారీరక , భావోద్వేగ ఒత్తిడిని పెంచకూడదన్నారు. తరచూ కఠినమైన శిక్షణా పద్ధతుల కారణంగా బాధకు గురవుతాయని అన్నారు. కఠినమైన ఆటల స్థానంలో ”ఏనుగుల పోలో, ఏనుగుల ఫుట్‌బాల్” వంటి ఆటలను నైతిక వైల్డ్‌లైఫ్ టూరిజంలో భాగం చేయాలని సూచించారు. పర్యావరణ పర్యాటకంలో ప్రపంచ అగ్రగామిగా నేపాల్ ఎదగాలని ఆకాంక్షించారు. జాన్ అబ్రహాం పెటా- ఇండియా ప్రచారకర్తగా ఉన్న సంగతి తెలిసిందే.
Read Also:PV Sindhu Wedding: వివాహ బంధంలోకి పీవీ సింధు.. దీవి ప్రత్యేకతలు ఇవే!