Devara : మార్చి 28న రిలీజ్ కానున్న దేవర.. కలెక్షన్ల సునామీ ఖాయమంటున్న ఫ్యాన్స్

  • బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన దేవర
    త్వరలో జపాన్ లో రిలీజ్ కు రంగం సిద్ధం
    మార్చి 28న విడుదల.. జనవరి 3నుంచి ప్రీ సేల్స్

Devara : యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ జంటగా కొరటాల శివ తెరకెక్కించిన దేవర సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. రిలీజ్ అయిన ప్రతీ చోట మొదట నెగిటివ్ టాక్ సొంతం చేసుకున్నా కలెక్షన్లు మాత్రం బాగానే రాబట్టింది. ఆ సెంటర్ ఈ సెంటర్ అని తేడా లేకుండా దసరా కానుకగా రిలీజ్ కాబడిన సినిమాల కంటే ఎక్కువ కలెక్షన్స్ రాబట్టి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది. యంగ్ టైగర్ నటన, యాక్షన్ సీన్స్, సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. దేవర విజయంతో తారక్ ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు.

Read Also:CM Revanth Reddy : మన్మోహన్ సింగ్ సద్గుణం, నిష్కళంకమైన చిత్తశుద్ధి ఉన్న వ్యక్తి

దేవర డిజిటల్ రైట్స్ ను భారీ ధరకు కొనుగోలు చేసింది ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్. అక్కడ కూడా దేవర దండయాత్ర చేశారు. ఓటీటీలో కూడా ట్రెండింగులో నిలిచింది. ఈ నేపథ్యంలో దేవర సీక్వెల్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే, ‘దేవర పార్ట్-2’ స్క్రిప్ట్ పనులు మొదలయ్యాయి. స్క్రీన్ ప్లే, కీలక సన్నివేశాలను ఆసక్తికరంగా మలిచేందుకు డైరెక్టర్ కొరటాల శివ, తన టీమ్‌ గత కొన్ని వారాలుగా పని చేస్తున్నారు. ఇక ఇప్పుడు ఈ సినిమా జపాన్‌లో దుమ్ములేపేందుకు రెడీ అవుతోంది.

Read Also:CM Chandrababu : మన్మోహన్ సింగ్ మరణం పట్ల సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్ర్భాంతి

‘దేవర’ చిత్రాన్ని జపాన్ దేశంలో వచ్చే ఏడాది మార్చి 28న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఇటీవల ‘కల్కి 2898 ఎడి’ చిత్రాన్ని జపాన్‌లో రిలీజ్ చేసిన డిస్ట్రిబ్యూషన్ సంస్థ ట్విన్, ఇప్పుడు ‘దేవర’ చిత్రాన్ని కూడా రిలీజ్ చేయనుంది. ఇక ‘దేవర’ చిత్ర ప్రీ-సేల్స్‌ను జనవరి 3 నుంచి ప్రారంభించనున్నారు. జపాన్‌లో ఎన్టీఆర్‌కు సాలిడ్ ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ చిత్రం తర్వాత ఆయన క్రేజ్ ఆకాశాన్నంటింది. ఇక ‘దేవర’ సినిమాకు కూడా జపాన్‌లో అదిరిపోయే రెస్పాన్స్ దక్కడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అలాగే, ఈ చిత్రంలో శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, అజయ్, మురళీ శర్మ ఇతర కీలక పాత్రల్లో నటించారు. తాజాగా ‘వార్-2’ షూటింగ్ పూర్తిచేసుకున్న ఎన్టీఆర్, ప్రస్తుతం ప్రశాంత్ నీల్‌ సినిమాపై దృష్టి పెట్టారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *