మన తెలుగు సినిమా దగ్గర సాలిడ్ కంటెంట్ పడినప్పుడు ఆడియెన్స్ కూడా వాటిని ఆదరించడంలో ముందుంటారు. అలా లేటెస్ట్ గా యంగ్ హీరో కిరణ్ అబ్బవరం చేసిన లేటెస్ట్ సినిమా “క” లో కూడా ఇదే జరిగింది. మరి ట్రైలర్ తోనే ఎంతో ఆసక్తి రేపింది. అలాగే ఈ సినిమా ట్రైలర్ తర్వాత ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మేకర్స్ కాన్ఫిడెన్స్ చూసి చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
అయితే ఈ సినిమా ట్రైలర్ లో సినిమాలో చూపించిన క్రిష్ణగిరి అనే ఊరి కోసం సినిమా చూసిన వారికి తెలిసే ఉంటుంది. ఆ ఊరిలో మధ్యాహ్నం మూడు గంటలకే చీకటి పడిపోతుంది అని చూపించారు. అయితే ఇది సినిమాలో చూసేందుకు మంచి ఆసక్తిగా అనిపించగా బయట కూడా నిజంగా అలాంటి ఊరు ఉందట. అది కూడా తెలంగాణ లోనే ఉందట.
తెలంగాణలో మూడుజాముల కొదురుపాక అనే ఊరిలో ఈ సినిమాలో చూపిన విధంగా చాలా త్వరగా చీకటి పడిపోతుంది అంట. అయితే సినిమాలో మూడు గంటలకి రాత్రి అయితే ఆ ఊరిలో మాత్రం ఒక గంట ఆలస్యంగా అంటే నాలుగు గంటలకి చీకటి అవుతుందట.నాలుగు దిక్కుల్లో నాలుగు కొండలు ఉండడంతో ఇలా అవుతుందట. దీనితో సినిమాలో చూపించిన ఆ ఊరు లాంటి ఊరు నిజ జీవితంలో కూడా ఉండడం ఇంట్రెస్టింగ్ గా ఉందని చెప్పాలి.
The post KA: “క” సినిమాలో లాంటి ఊరు నిజంగా ఉందట.. ఎక్కడంటే first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.