టాలీవుడ్ అందాల తార కాజల్ అగర్వాల్ ప్రస్తుతం కష్టకాలాన్ని ఎదుర్కొంటోంది. ఎప్పుడూ బిజీగా ఉన్నట్లు కనిపించినా, ఆమె చేతిలో గట్టి ప్రాజెక్ట్స్ లేవు. ఇటీవల కొన్ని సినిమాల్లో నటించేందుకు ఒప్పుకున్నా, ఫైనల్ స్టేజ్‌లో నుండి తప్పించబడుతున్నారు. ఈ పరిస్థితి ఆమె అభిమానులను నిరాశకు గురిచేస్తోంది.
కాజల్ కెరీర్‌లో మూడేళ్లుగా ఇదే సమస్య కొనసాగుతోంది. ‘ఆచార్య’ సినిమాతో ఆమె బ్యాడ్‌లక్ ప్రారంభమైంది. ఈ చిత్ర దర్శకుడు కొరటాల శివ, కథకు కాజల్ పాత్ర అవసరం లేదని షూటింగ్ అనంతరం ఆమె సన్నివేశాలను తొలగించారు. అలాగే, నాగార్జున ‘ఘోస్ట్’ సినిమాలో తొలుత హీరోయిన్‌గా తీసుకున్నా, చివరికి ఆమెను రీప్లేస్ చేశారు.
‘భగవంత్ కేసరి’లో నటించినా, ఆ సినిమా మొత్తం బాలకృష్ణ, శ్రీలీల చుట్టూ తిరిగింది. అందరూ ‘ఇండియన్ 2’తో కాజల్ జాతకం మారుతుందేమో అనుకున్నారు, కానీ అక్కడ కూడా పరిస్థితి మారలేదు. దర్శకుడు శంకర్ ఆమె పాత్రను పూర్తిగా ‘ఇండియన్ 3’కి మార్చేశారు. అయితే ‘ఇండియన్ 2’ ఫలితాన్ని బట్టి ‘ఇండియన్ 3’ సినిమా జరగడం అనుమానమే. దీంతో ఈ ప్రాజెక్ట్ ద్వారా కూడా ఆమెకు పెద్దగా ఉపయోగం లేకపోయింది.
ప్రస్తుతం కాజల్ ‘కన్నప్ప’ సినిమాలో పార్వతి పాత్రలో నటిస్తోంది. ఒకప్పటి టాప్ హీరోయిన్‌కు ఇప్పుడు మళ్లీ గోల్డెన్ ఛాన్స్ దక్కుతుందా అనే విషయంలో టాలీవుడ్ సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.