తమిళ స్టార్ హీరో సూర్య నటించిన లేటెస్ట్ మూవీ ‘కంగువా’ అత్యంత భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు శివ ప్రెస్టీజియస్‌గా డైరెక్ట్ చేయగా, అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను రూపొందించారు. అయితే, బాక్సాఫీస్ దగ్గర మాత్రం ‘కంగువా’ మూవీ అనుకున్న స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది.
ఈ సినిమా కథ ఆడియెన్స్‌కి పెద్దగా నచ్చకపోవడంతో ఈ చిత్రం ఫ్లాప్‌గా నిలిచింది. ఈ మూవీపై భారీ అంచనాలు పెట్టుకున్న సూర్య, ‘కంగువా’ రిజల్ట్‌తో ఖంగుతిన్నాడు. ఇక అభిమానులు సైతం ఈ సినిమా డిజాస్టర్ కావడంతో నిరాశకు లోనయ్యారు. అయితే, ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ ఆడియెన్స్‌ను ఆకట్టుకునేందుకు వస్తోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘కంగువా’ చిత్రం డిసెంబర్ 8 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
ఈ మేరకు తాజాగా అధికారిక ప్రకటన చేశారు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్ పాత్రలో నటించగా, దిశా పటాని హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్లు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేశాయి. మరి కంగువా చిత్రం ఓటీటీ ఆడియెన్స్‌ని ఎంతమేర ఆకట్టుకుంటుందో చూడాలి.
The post ‘కంగువా’ ఓటీటీ డేట్ వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే? first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.