Kanguva Movie Review in Telugu, Suriya, Bobby Deol, Disha Patani

విడుదల తేదీ : నవంబర్ 14, 2024

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు : సూర్య, బాబీ డియోల్, దిశా పటానీ, నటరాజన్ సుబ్రమణ్యం, K. S. రవికుమార్, యోగి బాబు, కోవై సరళ, మన్సూర్ అలీ ఖాన్ తదితరులు.

దర్శకుడు : శివ

నిర్మాతలు : కె. ఇ. జ్ఞానవేల్ రాజా

సంగీత దర్శకుడు : దేవి శ్రీ ప్రసాద్

సినిమాటోగ్రఫీ : వెట్రి పళనిస్వామి

ఎడిటింగ్ : నిషాద్ యూసుఫ్

సంబంధిత లింక్స్: ట్రైలర్

 

హీరో సూర్య హీరోగా వచ్చిన చిత్రం ‘కంగువా’. శివ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. కాగా ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

 

కథ :

ఫ్రాన్సిస్ (సూర్య) బౌంటీ హంటర్‌ గా పని చేస్తూ ఉంటాడు. తన మాజీ గర్ల్ ఫ్రెండ్ దిశా పటానీ కూడా అతనికి పోటీగా ఉంటుంది. అయితే, అనుకోకుండా ఫ్రాన్సిస్‌ కి గోవాలో ఓ బాబు కలుస్తాడు. ఆ బాబు ఎవరు ?, ఆ బాబుకి, ఫ్రాన్సిస్‌కి ఏదో బంధం ఉందని అతనికి ఏవో జ్ఞాపకాలు వస్తుంటాయి. ఆ బంధం గత జన్మదని అతనికి గుర్తు వస్తూ ఉంటుంది. ఈ క్రమంలో కొన్ని నాటకీయ పరిణామాల మధ్య కొన్ని.. వందల ఏళ్ల కిందట జరిగిన ఆ కథలో కంగువా (సూర్య) ఎవరు ?, అతను తన జాతి బాగు కోసం ఏం చేశాడు ?, కంగువా తెగకి, మిగిలిన తెగల మధ్య జరిగిన యుద్ధం ఏమిటి ?, ఈ క్రమంలో కంగువా చేసే పోరాటాలు ఏమిటి ?, చివరకు ఈ జన్మలో ఫ్రాన్సిస్ గా పుట్టిన కంగువా ఏం సాధించాడు ? అనేది మిగిలిన కథ.

 

ప్లస్ పాయింట్స్ :

ఎప్పటిలాగే, కంగువా, ఫ్రాన్సిస్ పాత్రల్లో సూర్య అద్భుతంగా నటించాడు. ద్విపాత్రాభినయంలో సూర్య అభినయం మొత్తం సినిమాకే మెయిన్ హైలైట్. తన జాతి కోసం, ఇచ్చిన మాట కోసం ప్రాణం ఇచ్చే వ్యక్తి’గా సూర్య నటించిన విధానం, నిజంగా చాలా బాగుంది. సూర్య నుంచి ఆయన అభిమానులు ఎలాంటి సినిమా కోరుకుంటున్నారో, ఈ సినిమా అలాగే భారీ విజువల్స్ మరియు ‘వైల్డ్ యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎలిమెంట్స్’ తో సాగింది.

హీరోయిన్ గా దిశా పటానీ తన పాత్రకు న్యాయం చేసింది. గ్లామర్ లుక్స్ లో ఆమె యూత్ ని ఆకట్టుకుంది. బాలీవుడ్‌ నటుడు బాబీ డియోల్ కూడా తన పాత్రలో జీవించాడు. బాబీ డియోల్ పాత్రలోని డెప్త్ ఆకట్టుకుంది. సూర్య పాత్రకు దీటుగా ఆయన పాత్రను దర్శకుడు శివ తీర్చిదిద్దారు. నటరాజన్ సుబ్రమణ్యం కూడా చాలా బాగా నటించాడు. అతని స్రీన్ ప్రెజెన్సీ కూడా బాగుంది. ఇతర కీలక పాత్రల్లో కనిపించిన K. S. రవికుమార్, యోగి బాబు, కోవై సరళ, మన్సూర్ అలీ ఖాన్ ఆకట్టుకున్నారు.

అదేవిధంగా అతిథి పాత్రలో మెరిసిన కార్తీ సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. ఇక మిగిలిన నటీనటులు కూడా అయా పాత్రల్లో తమ నటనతో మెప్పించారు. క్లైమాక్స్‌లో అండ్ ప్రీ క్లైమాక్స్‌లో వచ్చే సముద్రపు యాక్షన్ సీక్వెన్సెస్ చాలా బాగున్నాయి. అలాగే ఆ చిన్న బాబుకి – సూర్యకి మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ కూడా ఆకట్టుకున్నాయి.

 

మైనస్ పాయింట్స్ :

ఈ ‘కంగువా’లో బరువైన ఎమోషన్స్ తో, భారీ విజువల్స్ ఉన్నా.. కథనం పరంగా వచ్చే కొన్ని సీన్స్ సినిమా స్థాయికి తగ్గట్లు పూర్తి స్థాయిలో ఆకట్టుకోవు. అలాగే సినిమాలో ఉన్నంత హైప్ ను సినిమా మొత్తం కంటిన్యూ చేయలేక పోయారు. ఇక దిశా పటానీ – సూర్య పాత్రల మధ్య లవ్ ట్రాక్ కూడా ఇంకా బెటర్ గా ఉండి ఉంటే బాగుండేది.

మొత్తానికి ‘కంగువా’ కథలో చెప్పాలనుకున్న మెయిన్ థీమ్ తో పాటు యాక్షన్ సన్నివేశాల్లో (ముఖ్యంగా కంగువా క్లైమాక్స్ లో) మంచి పనితీరుని కనబర్చిన దర్శకుడు శివ, మిగిలిన కొన్ని సన్నివేశాల్లో మాత్రం నెమ్మదిగా కనిపించారు. ఆ సన్నివేశాలను కూడా ఇంకా ఆసక్తికరంగా మలిచే అవకాశం ఉన్నప్పటికీ, దర్శకుడు మాత్రం తను అనుకున్న ఎమోషనల్ డ్రామానే ఎలివేట్ చేయడానికే ఆసక్తి చూపారు.

 

సాంకేతిక విభాగం :

ఈ సినిమాకు సంబంధించి సాంకేతిక విభాగం గురించి మాట్లాడుకుంటే.. సినిమాటోగ్రాఫర్‌ వెట్రి పళనిస్వామి సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. సినిమాలోని కీలక సన్నివేశాలతో పాటు మిగిలిన యాక్షన్ సన్నివేశాలను కూడా కథాకథనాలకు అనుగుణంగా ఆయన అద్భుతంగా చిత్రీకరించారు. నిషాద్ యూసుఫ్ ఎడిటింగ్ కూడా చాలా బాగుంది. ఇక సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ సమకూర్చిన పాటలు బాగానే ఉన్నాయి. వాటి పిక్చరైజేషన్ కూడా బాగుంది. నేపథ్య సంగీతం కొన్ని చోట్ల బాగుంది. శివ రచయితగా దర్శకుడిగా ఈ చిత్రానికి న్యాయం చేశారు. నిర్మాత కె.ఇ. జ్ఞానవేల్ రాజా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆయన నిర్మాణ విలువలు బాగున్నాయి.

 

తీర్పు :

పీరియాడిక్ యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామాగా వచ్చిన ఈ ‘కంగువా’.. యాక్షన్ సీక్వెన్సెస్ తో పాటు కొన్ని ఎమోషనల్ సీన్స్ తోనూ ఆకట్టుకుంది. ముఖ్యంగా సూర్య పవర్ ఫుల్ నటన, క్లైమాక్స్ లో సర్‌ప్రైజింగ్ ఎలిమెంట్స్ మరియు సాంకేతిక విభాగం నుంచి అందిన మంచి పనితనం బాగున్నాయి. కానీ, రొటీన్ స్క్రీన్ ప్లే, కొన్ని సన్నివేశాలు స్లోగా సాగడం, లవ్ స్టోరీ కూడా పెద్దగా ఆకట్టుకోకపోవడం వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి. ఐతే, సూర్య తన నటనతో ఈ సినిమాని మరో లెవల్ కి తీసుకు వెళ్లారు. ఓవరాల్ గా ఈ చిత్రం సూర్య అభిమానులను మాత్రమే అలరిస్తుంది.

123telugu.com Rating: 2.75/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *