‘కంగువా’ తెలుగు ప్రమోషన్స్‌కు డేట్ ఫిక్స్ | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings

Published on Oct 23, 2024 4:10 PM IST

తమిళ హీరో సూర్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కంగువా’పై అంచనాలు భారీగా క్రియేట్ అయ్యాయి. దర్శకుడు శివ తెరకెక్కిస్తున్న ఈ ఫాంటెసీ యాక్షన్ మూవీలో సూర్య సరికొత్త లుక్‌తో కనిపిస్తుండటంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్, టీజర్, ట్రైలర్లు ఇప్పటికే ప్రేక్షకులను ఇంప్రెస్ చేశాయి.

అయితే, ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో భారీగా రిలీజ్ చేస్తున్నారు. దీనికోసం చిత్ర యూనిట్ ప్రమోషన్స్ కూడా భారీగా చేస్తున్నారు. ఇప్పటికే నార్త్‌లో ప్రమోషన్స్ చేసిన సూర్య అండ్ టీమ్, ఇప్పుడు తెలుగులో కూడా ప్రమోషన్స్ చేయనున్నారు. ‘కంగువా’ చిత్ర యూనిట్ ఓ ప్రెస్ మీట్ పెట్టి మీడియాతో ముచ్చటించనుంది. దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా చేశారు. అక్టోబర్ 24న హైదరాబాద్‌లోని ఏఎంబి సినిమాస్‌లో సాయంత్రం 5 గంటలకు ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.

ఈ సినిమాలో బాబీ డియోల్ విలన్ పాత్రలో నటిస్తుండగా అందాల భామ దిశా పటాని హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా యూవీ క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ బ్యానర్లు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ఈ చిత్రాన్ని నవంబర్ 14న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *