Published on Nov 2, 2024 11:00 AM IST
తమిళ హీరో సూర్య నటించిన లేటెస్ట్ మూవీ ‘కంగువా’ ఇఫ్పటికే ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలను క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు శివ తెరకెక్కిస్తుండగా పూర్తి ఫాంటెసీ యాక్షన్ డ్రామాగా ఈ మూవీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యింది. ఈ సినిమాలో సూర్య రెండు వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను జ్ఞానవేల్ రాజా అత్యంత భారీ బడ్జెట్తో ప్రొడ్యూస్ చేశారు.
అయితే, ఇఫ్పుడు ఈ చిత్ర నిర్మాతపై మద్రాస్ హై కోర్టులో కేసు నమోదయ్యింది. ప్రముఖ నిర్మాణ సంస్థ రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ జ్ఞానవేల్ రాజా తమకు దాదాపు రూ.100 కోట్లు బకాయి పడ్డారని.. తమకు పూర్తి మొత్తం చెల్లించిన తరువాతే ‘కంగువా’ చిత్రాన్ని రిలీజ్ చేయాలంటూ వారు తమ కేసులో పేర్కొన్నారు. జ్ఞానవేల్ రాజా గతంలో వరుస పరాజయాలను చవిచూశారు.
తమ నుండి రూ.99.22 కోట్లు జ్ఞానవేల్ తీసుకున్నాడని.. ఇంకా రూ.45 కోట్ల మేర చెల్లించాలని రిలయన్స్ డిమాండ్ చేస్తోంది. అయితే, ఈ కేసుపై మద్రాసు కోర్టు నవంబర్ 7న వాదనలు వినేందుకు అంగీకరించింది. మరి ఈ ప్రభావం ‘కంగువా’ రిలీజ్పై ఎంతమేర పడుతుందో చూడాలి.