Tollywood : టాలీవుడ్ లో పాగా వేస్తున్న కన్నడ బ్యూటీ

  • తెలుసు కదాతో ఎంట్రీ ఇస్తున్నకేజీఎఫ్ బ్యూటీ
  • నాని పక్కన గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిన కన్నడ సోయగం
  • కలిసి రాని తమిళ్ ఎంట్రీ

టాలీవుడ్ లో మాలీవుడ్ ముద్దుగుమ్మలు, తమిళ పొన్నుల హవాతో పాటు కన్నడ సోయగాల జోరు టాలీవుడ్ లో పెరిగింది. ఈ మధ్య కాలంలో శాండిల్ వుడ్ భామలకు లక్కీ ఇండస్ట్రీగా మారిపోయింది. రష్మిక నుండి రుక్మిణీ వసంత్ వరకు ఎంతో మంది తమ టాలెంట్ ఫ్రూవ్ చేసుకున్నారు. ఇప్పుడు మరో కన్నడ కస్తూరీ ఎంట్రీకి రెడీ అవుతోంది. టాలీవుడ్ రేంజ్ పాన్ ఇండియన్ లెవల్లోకి ఛేంజ్ కావడంతో శాండిల్ వుడ్ భామలు రెక్కలు కట్టుకుని వాలిపోతున్నారు. కన్నడ ఇండస్ట్రీ నుండి వచ్చిన రష్మిక ప్రెజెంట్ బాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకటిగా రాణిస్తోంది.

గతంలో ఎంతో మంది శాండిల్ వుడ్ భామలు తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ రష్మిక క్రేజ్ డబులయ్యాక టాలీవుడ్ లక్కీగా మారిపోవడంతో క్యూ పెరిగింది. రీసెంట్ టైమ్స్ లో ఆషికా రంగనాథ్, రుక్మిణీ వసంత్ క్రేజ్ తెచ్చుకుంటే  షరతులు వర్తిస్తాయి ఫేమ్ భూమి శెట్టి, వెయ్ దరువెయ్ హీరోయిన్ యషా శివ కుమార్ ఓకే అనిపించారు.
ఇప్పుడు ఈ ముద్దుగుమ్మలు ఇచ్చిన ఇన్పిపిరేషన్ తోనే కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి కూడా టాలీవుడ్ తెరంగేట్రం చేస్తోంది. కేజీఎఫ్ సిరీస్ తో శాండిల్ వుడ్ లో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న ఈ కన్నడ సోయగం  తెలుగులో అడుగులు వేసేందుకు ప్రయత్నించి రెండు ఆఫర్లను దక్కించుకుంది. టిల్లు సిద్దు జొన్నల గడ్డ నెక్ట్స్ ప్రాజెక్ట్ ‘తెలుసు కదా ‘మూవీలో ఆఫర్ కొల్లగొట్టింది ఈ భామ. దీనితో పాటు హిట్ సిరీస్ లోనూ నటించే గోల్డెన్ ఛాన్స్ దక్కించుకుంది. నానితో జతకట్టే లక్కీ ఛాన్స్ పొందింది. ఇదే కాదు  కిచ్చా సుదీప్ 47వ సినిమాలో కూడా యాక్ట్ చేసే ఆఫర్ ను సొంతం చేసుకుంది. ఇలా మూడు ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నప్పుడు రష్మికలా ఓవర్ నైట్ స్టార్ డమ్ తెచ్చుకుని బాలీవుడ్ బాట పడుతుందేమో చూడాలి.
 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *