Dr. Shiva Rajkumar: క్యాన్సర్ తగ్గింది.. ఫాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన శివ రాజ్ కుమార్

కన్నడ స్టార్ హీరో శివరాజ్‌కుమార్‌కు మూత్రాశయ క్యాన్సర్‌ పూర్తిగా నయమైందని వైద్యులు ధృవీకరించారు. చికిత్స అనంతరం కోలుకుంటున్నానని, త్వరలో సినిమాలు మళ్ళీ మొదలు పెడతానని అన్నారు. శివరాజ్‌కుమార్‌కు మూత్రాశయ క్యాన్సర్‌ పూర్తిగా నయమైందని డాక్టర్‌ అధికారికంగా తెలిపారని ఆయన భార్య గీతా శివరాజ్‌కుమార్‌ తెలిపారు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ, శివరాజ్‌కుమార్ తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో 4 నిమిషాల వీడియోను పోస్ట్ చేసి, వైద్యులు శివన్నకు క్యాన్సర్ లేదని చెప్పారన్నారు. శివరాజ్‌కుమార్ కూడా మాట్లాడుతూ ఆపరేషన్ నుంచి కోలుకుంటున్నానని, త్వరలో రంగంలోకి దిగుతానని చెప్పారు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీ ప్రార్థనలకు ధన్యవాదాలు. శివరాజ్‌ కుమార్‌కి సంబంధించిన అన్ని రిపోర్ట్‌లు నెగిటివ్‌గా వచ్చాయి. చివరకు మేము పాథాలజిస్ట్ రిపోర్ట్ కోసం ఎదురు చూస్తున్నాము. అది కూడా నెగెటివ్ అని వచ్చిందని అన్నారు. శివరాజ్‌కుమార్‌కు క్యాన్సర్‌ నయమైందని వైద్యులు అధికారికంగా ప్రకటించారు. మీ ప్రార్థనలు, ఆశీస్సులతోనే శివరాజ్‌కుమార్‌ ఇంత బాగా ఉండగలిగారు. ఇది నా జీవితంలో మరిచిపోలేను అని గీతా శివరాజ్‌కుమార్ వీడియోలో తెలిపారు.

Hit 3: నాని సినిమా షూటింగ్‌లో విషాదం

ఆ తర్వాత శివరాజ్‌కుమార్‌ మాట్లాడుతూ బెంగుళూరులో కీమోథెరపీ చేసిన డాక్టర్లు, నర్సులు నన్ను బాగా చూసుకున్నారు. ను క్లైమాక్స్ ఫైట్స్ ఎలా చేశానో నాకు తెలీదు. క్రెడిట్ రవి వర్మన్‌కే దక్కాలి. అమెరికా వెళ్లే రోజు దగ్గర పడే కొద్దీ టెన్షన్ ఎక్కువైంది. ఈ సమయంలో నాతో పాటు ఉన్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. గీత లేకుండా నేను లేను. మధు బంగారప్ప గురించి ఎంత చెప్పినా తక్కువే, చిన్నపిల్లాడిలా చూసుకున్నారు. బాప్టిస్ట్ హాస్పిటల్, మియామీ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కూడా నన్ను బాగా చూసుకున్నాయి. ఇది చాలా పెద్ద ఆపరేషన్. కిడ్నీ మార్పిడి చేశామని చెబుతున్నారు. కానీ, విషయం అది కాదు. క్యాన్సర్‌తో కూడిన యూరినరీ బ్లాడర్‌ను తొలగించారు. ఇప్పుడు కొత్త బ్లాడర్‌ను అమర్చినట్లు చెప్పారు, ఇదే జరిగింది. నేను తిరిగి వస్తాను. అప్పుడు ఎలా ఉన్నానో, ఇప్పుడూ అలాగే ఉన్నాను. ఎప్పుడూ రెట్టింపు శక్తి ఉంటుంది. డ్యాన్స్, ఫైటింగ్, లుక్స్ రెండింతల శక్తిని కలిగి ఉంటాయి. మీ ప్రేమ, నమ్మకాన్ని ఎప్పటికీ మరువలేనని శివరాజ్ కుమార్ అన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *