Sandalwood : హీరో, దర్శకులుగా హిట్స్ అందుకున్న కన్నడ స్టార్ హీరోలు

2024లో కన్నడ ఇండస్ట్రీలో ఓ ఇద్దరు స్టార్ హీరోలు యాక్టర్లుగానే కాకుండా ఫిల్మ్ మేకర్లుగా కూడా ఫ్రూవ్ చేసుకున్నారు. హయ్యెస్ట్ కలెక్షన్స్ వసూళ్లు చేసిన చిత్రాల్లో తమ సినిమాలను నిలిపారు ఈ టూ టాలెంటెడ్ యాక్టర్స్. 2024లో వంద కోట్ల కలెక్షన్స్ వసూలు చేసే సినిమా ఒక్కటంటే ఒక్కటి రాలేదు శాండిల్ వుడ్ నుండి. కానీ స్టార్ హీరోస్ హిట్స్ అందుకోవడం కాస్త ఊరటనిచ్చే అంశం. ఉపేంద్ర, కిచ్చా సుదీప్, దునియా విజయ్, శివరాజ్ కుమార్ లాంటి స్టార్స్ బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ముఖ్యంగా దునియా విజయ్, ఉపేంద్ర లాంటి స్టార్ హీరోలు వెల్ ఫెర్మాసింగ్ చూపించారు. యాక్టర్లుగానే కాకుండా దర్శకులుగా సక్సెస్ అందుకున్నారు

వీరసింహారెడ్డితో నెగిటివ్ రోల్ తో ఇటీవల తెలుగు ప్రేక్షకులను పలకరించిన దునియా విజయ్, భీమాతో ఇటు హీరోగా, అటు దర్శకుడిగా సక్సీడ్ అందుకున్నాడు. జస్ట్ రూ. 8 కోట్లతో భీమా తీస్తే ఇంచు మించు రూ. 30 కోట్ల వసూళ్లను రాబట్టుకుంది. ఈ ఏడాది హయ్యెస్ట్ గ్రాసర్ చిత్రాల్లో ధర్డ్ ప్లేసులో నిలిచింది. కథ, స్క్రీన్ ప్లే బాధ్యతలను కూడా దునియా విజయ్యే భుజాన వేసుకుని విజయం సాధించాడు. 2024 ఎండింగ్ లో తన మార్క్ చూపించాడు ఉపేంద్ర. ఈ వెర్సటైల్ యాక్టర్ దర్శకుడిగా, నటుడిగా డ్యూయల్ రోల్ పోషించాడు. ఈ రెండు కేటగిరీలోనూ సక్సెస్ అందుకున్నాడు. ఫిల్మ్ మేకర్ గా గ్యాప్ తీసుకున్న ఉప్పి యుఐ సెటైరికల్ మూవీతో సూపర్ ఫెర్మామెన్స్ చూపి సక్సెస్ చవి చూశాడు. స్టోరీ, డైరెక్షన్ రెస్పాన్సిబులిటీని తీసుకున్నాడు. అలా ఉపేంద్రతో పాటు దునియా విజయ్ డ్యూయల్ బాధ్యతల్లో సక్సెస్ అందుకున్నారు. ఇలా కన్నడ పరిశ్రమలో గతేడాది అటు హీరోలుగా ఇటు దర్శకులుగా సూపర్ హిట్స్ అందుకున్నారు ఈ ఇద్దరు హీరోలు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *